ఇలాంటి సంఘ‌ట‌న మీరెపుడూ విని ఉండ‌రు

May 25, 2020

అదేంది... ఇది ఎక్క‌డ‌యినా సాధ్య‌మ‌వుతుందా? గాల్లో వెళ్లే హెలికాప్ట‌ర్‌ను నేల మీద పోయే ట్ర‌క్కు ఎలా ఢీకొంటుంది? అని న‌మ్మ‌డం లేదు క‌దా. క‌ర్మ కాలితే ఇలాగే ఉంటుంది. గాల్లో ఎగరాల్సిన హెలికాప్టర్ సాంకేతిక లోపంతో రోడ్డుపై దిగింది. అయితే, ఇది జ‌రిగింది అమెరికాలో. అక్క‌డ రోడ్లు నిర్ణీత వేగం నిర్దేశించ‌బ‌డి ఉంటాయి. ఇది అరుదైన ఘ‌ట‌న కాబ‌ట్టి ట్రక్కు డ్రైవ‌రు నిర్దేశిత స్పీడుతో వ‌చ్చాడు. అనుకోని విధంగా రోడ్డు మీద హెలికాప్ట‌ర్ ఉండ‌టం గ‌మ‌నించ‌లేదు. దీంతో అదుపు చేయ‌లేక దానికి ఢీకొన్నాడు. దీంతో ట్ర‌క్కు న‌డుపుతున్న డ్రైవ‌రు చ‌నిపోయాడు.
పూర్తి వివ‌రాలు... అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది ఈ ఘటన. ఇద్దరు వ్యక్తులతో వెళుతున్నఓ తేలికపాటి హెలికాప్టర్ బ‌య‌లుదేరింది. గాల్లోకి లేచాక సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో, ఆ హెలికాప్టర్ ను పైలట్ పామ్ నదీతీరంలో ఓ జాతీయ ర‌హ‌దారిపై దించాడు పైల‌ట్‌. అయితే, రోడ్డు మీదే ఉంచ‌లేదు. దానిని రోడ్డు పక్కకి నడిపించే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గానే ఓ ట్రక్కు వేగంగా వచ్చి హెలికాప్టర్ ను ఢీకొట్టింది. హెలికాప్టర్ కు ఉండే రోటార్ బ్లేడ్లు ట్రక్కులోకి చొచ్చుకు వెళ్లాయి. దీంతో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. హెలికాప్టర్ లో ఉన్న వారికి కూడా గాయాల‌య్యాయి. హెలికాప్టర్ ధ్వంసం అయ్యింది.