20 ఏళ్లలో చైనా కనిపెట్టిన 5 డెడ్లీ వైరస్ లు

August 12, 2020

క-రోనా వైరస్ ను చైనా వైరస్ గా విమర్శిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు తీవ్రంగా మండిపడిన ట్రంప్... ప్రపంచం నుంచి ఆ దేశాన్ని వేరుచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఒక సంచలన విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు ట్రంప్... చైనా గత రెండు దశాబ్దాల్లో 5 ప్రాణాంతాక వైరస్ లను ప్రపంచ మీదకు వదిలిందని, ఇక ఎలాగైనా చైనా రోగాలకు అడ్డుకట్ట వేయాలని అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఆ దేశం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు నాశనం కావడంతో పాటు లక్షలమంది ప్రాణాలు పోయాయని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓబ్రియాన్‌ ఆరోపించారు. బల్లగుద్ధి చెబుతున్నాం... కొవిడ్ చైనాలోని వుహాన్‌ నుంచే వచ్చిందనడానికి అన్ని ఆధారాలున్నాయన్నారు.

చైనా వ్యాధులను ప్రపంచం మీద వేయడానికి ప్రజలు ఇంక ఏమాత్రం సహించరని.. హెచ్చరించారు. 20 సంవత్సరాల వ్యవధిలో సార్స్‌, బర్డ్‌ ఫ్లూ, స్వైన్‌ ఫ్లూ.. తాజాగా కొవిడ్ ...  ఐదు అంటువ్యాధులు చైనా ప్రపంచానికి అంటించింది. అది అతిపెద్ద బాధ్యతారాహిత్య దేశం అని రాబర్ట్ దుయ్యబట్టారు. ఒక్క అమెరికాలోనే 14 లక్షల కేసులు, 84 వేలకు పైగా మరణాలు సంభవించాయి. పైగా ఇది ఆర్థిక వ్యవస్థ మీద భారీగా దారుణమైన ప్రభావాన్ని చూపిందన్నారు.   
అందుకే చైనా సంతి తేల్చేందుకు అగ్రరాజ్యం సిద్ధమైంది. అమెరికన్ కాంగ్రెస్‌లో కీలక బిల్లు కూడా ప్రవేశ పెట్టింది. కరో‘నా వ్యాప్తికి సంబంధించిన వివరాలను అందించేందుకు డ్రాగన్ దేశం సహకరించని పక్షంలో కఠిన ఆంక్షలు విధించేదిశగా అడుగులేస్తోంది. తొమ్మిది మంది సెనేటర్లు మంగళవారం బిల్లును సెనేట్‌ ముందుంచారు. ఈ బిల్లుకు ‘‘ది కొవిడ్‌-19 అకౌంటబిలిటీ యాక్ట్’’ అని నామకరణం చేశారు.‌ 

వైరస్‌ వ్యాప్తిలో చైనా పాత్ర, U.N.O. అనుబంధ సంస్థల విచారణకు .. చైనా సహకరించాలని సెనెట్ సభ్యులు సూచించారు. దర్యాప్తునకు అవసరమైన సమాచారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు చైనాలోని జంతు మాంస విక్రయశాలల్ని సైతం మూసివేయాలని డిమాండ్‌ చేశారు.