ట్రంప్ కి గట్టి షాక్ తగిలినట్టే

August 13, 2020

కోవిడ్ ఒకవైపు - ఎన్నికలు ఒకవైపు... దీంతో పదవి ఎక్కడ చేజారుతుందో అన్న భయంతో ట్రంప్ ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా నిర్ణయాలు తీసేసుకుంటున్నాడు. దీంతో అవి బ్యాక్ ఫైర్ అవుతున్నాయి. ఇటీవలే ప్రవాసులపై అనేక ఆంక్షలు విధించడం, వీసాలు రద్దు వంటివి చేసిన ట్రంప్... చివరకు విదేశాల నుంచి ఆన్ లైన్ క్లాస్ లు వింటు అమెరికన్ యూనివర్సిటీ విద్యార్థులు వీసాలు రద్దుచేయడం సంచలనంగా మారింది.

తీవ్రవివాదాస్పదం అయిన ఈ నిర్ణయంపై విదేశాలతో పాటు అమెరికాలోను వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో తాజాగా ఆ నిర్ణయాన్ని ట్రంప్ సర్కారు ఉపసంహరించుకుంది. దేశ‌వ్యాప్తంగా విద్యాసంస్థ‌ల నుంచి ఆందోళ‌న‌లు వ్య‌క్తం కావ‌డం ఈ నిర్ణయం ఉపసంహరించుకోవడానికి మూల కారణం. ఈ నిర్ణయం అమెరికా వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలను కుప్పకూల్చే ప్రమాదం ఉందన్న విషయం అర్థమై ట్రంప్ వెనక్కు తగ్గారు.

విచిత్రం ఏంటంటే... వారు స్వంత దేశంలో ఉండి అమెరికా పాఠాలు ఆన్ లైన్లో వింటున్నవారు కాదు. ప్రస్తుతం అమెరికాలో విద్యార్థి వీసాపై ఉంటే కోవిడ్ వల్ల ఆన్‌లైన్ పాఠాలు వింటున్న విదేశీ విద్యార్థులు. వీరందరు ఆన్ లైన్ క్లాసుల కోసం ఇక్కడుండాల్సిన అవసరం ఏంటి? దేశం విడిచి వెళ్లాల‌ని అమెరికా ఆదేశించింది. దీంతో అమెరికా విద్యాసంస్థలు కేవలం దీనిని వ్యతిరేకించడమేకాదు కాదుకోర్టుకు ఎక్కాయి. 

ట్రంప్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై  హార్వ‌ర్డ్‌, మ‌సాచుసెట్స్‌ యూనివ‌ర్సిటీలు.. కోర్టులో దావా వేశాయి. అమెరికా ఇమ్మిగ్రేష‌న్‌, క‌స్ట‌మ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ)పై కేసును ఫైల్ చేశాయి. ఈ నేప‌థ్యంలో త‌మ నిర్ణ‌యాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయం భారతీయ విద్యార్థులకు కూడా ఎంతో సంతోసం కలిగించే విషయం. వేలాది తల్లిదండ్రులకు ఆనందదాయకమైన విషయం.