భారత్ కి ట్రంప్ బంపరాఫర్ !

August 11, 2020
CTYPE html>
ఇండియా టూర్లో ఉన్న ట్రంప్... లక్షల మంది సాక్షిగా భారతదేశానికి భారీ హామీ ఇచ్చారు. ఇండియాకు అమెరికాకు అత్యంత ప్రియమైన దేశమని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.  మా మిత్ర దేశమైన ఇండియాకు ఈ భూమ్మీద అమెరికా దగ్గర తప్ప ఇంకెవరి దగ్గరా లేనట్టి శక్తివంతమైన ఆయుధాలను అందజేస్తామని బహిరంగ వేదికపై వెల్లడించారు. మంగళవారం భారత్ తో 3 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందాలను కుదుర్చుకుంటామని చెప్పారు. రక్షణ ఒప్పందాల్లో భాగంగా మిత్ర దేశం భారత్ వద్ద ఈ భూమండలం మీద అత్యుత్తమ మిలిటరీ పరికరాలను ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఎవరి వద్దా లేనివి మాత్రమే కాదు... మరెవరూ తయారుచేయలేనంత గొప్ప ఆయుధాలను అందిస్తాం అన్నారు.
అమెరికా, భారతదేశాలు రెండూ అతివాద ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయని, ఈ పోరాటం తమ రెండు దేశాలనూ కలుపుతోందని చెప్పారు. ఈ ప్రకటన భారతదేశపు పొరుగుదేశాలను, ముఖ్యంగా పాకిస్తాన్ కు పిడుగుపాటు వంటి వార్త. పాకిస్థాన్‌లో ఉన్న ఉన్న ఉగ్రవాద శిబిరాలను నిర్మూలించేందుకూ ప్రయత్నిస్తున్నామని.. పాక్‌తో తమకు మంచి సంబంధాలు ఉన్నందున సానుకూల పద్ధతుల్లోనే ఉగ్రవాద శిబిరాల నిర్మూలనకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అమెరికాలో తన పాలనలో ఐఎస్‌ను 100 శాతం నిర్మూలించానని.. ఐఎస్ అధినేత అల్ బాగ్దాదీ హతమయ్యాడని ప్రకటించిన ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ ప్రసంగంతో పాక్ జడుసుకునే ప్రమాదం ఉంది. చాలా కాలం పాక్ అమెరికా అండ తనకు ఉంటుందనుకుని  భావిస్తూ వచ్చింది. కానీ కాలానుగుణంగా పాక్ స్థావరాల కంటే భారత్ అవసరాలే అమెరికాకు ఎక్కువ ఉన్న నేపథ్యంలో భారతదేశంతో స్నేహం అమెరికాకు తప్పనిసరి అయ్యింది.