ఒరేయ్ ... చైనాగా ... 

August 12, 2020

ట్రంప్ తీరు...  అచ్చం కేసీఆర్ ను పోలి ఉంటంది... కొన్నిసార్లు ఈ ఇద్దరు తమ స్థాయిని పక్కన పెట్టి సామాన్యుడిలా ఫీలింగ్స్ ఎక్స్ ప్రెస్ చేస్తుంటారు.

అపుడు జనం వారికి కనెక్టైపోతుంటారు. వారు ఆయా వ్యాఖ్యలు, మాటలు చేయాల్సిన అవసరం ఉండదు. కానీ అవన్నీ వారి వ్యూహాత్మక వ్యక్తీకరణ. 

తాజాగా ట్రంప్ చేసిన అలాంటి వ్యాఖ్య ఒకటి వైరల్ అవుతోంది.

‘‘నాకు చాలా కోపం వచ్చేస్తుంది...‘‘ అని ఈ హెడ్డింగ్ చదవగానే... ఎవరో హీరోయిన్ ఇంటర్వ్యూలో ఎక్స్ ప్రెషన్ అయ్యి ఉంటుంది.

మంచి యుట్యూబ్ వీడియో హెడ్డింగ్ లా అనిపించి లోపలకు వెళ్తే... అది ట్రంప్ వ్యాఖ్య కావడం ఒక చిన్న సర్ ప్రైజ్.

ఇంతకీ ట్రంప్ ఇలా ఎందుకన్నాడు? ఎందుకు అనాల్సి వచ్చిందో తెలుసుకుందాం.

మరో 130 రోజుల్లో అమెరికా ఎన్నికలున్నాయి.

సరిగ్గా ఇంతటి కీలక సమయంలో పాండెమిక్ ప్రపంచాన్ని చుట్టుముట్టేసింది.

జనజీవనం స్తంభించిపోయింది. అందరిలో భవిష్యత్తుపై హోప్ నశించిపోతోంది. అమెరికాను అయితే కరోనా అల్లాడించేస్తుంది.

రోజుకు అర లక్ష కేసులు వచ్చేస్తుంది. సరిగ్గా ఎన్నికల సమయంలో ఇలా రావడంతో ట్రంప్ లో ఓటమి భయంపెరుగుతోంది. 

కరోనా వల్ల ఆర్థికంగా వాటిల్లిన నష్టానికి ఇంతకాలం చైనాను విపరీతంగా తిట్టిన ట్రంప్... తాజాగా ఈ వైరస్ ఏకంగా తన అధ్యక్ష పదవికే ముప్పు తెచ్చేటప్పటికి ట్రంప్ కి మండిపోతోంది.

దీంతో తన బాధను, ఆవేదనను వెళ్లగక్కారు ట్రంప్. ఆయన ఏమన్నారంటే... ‘‘ కరోనా ప్రపంచవ్యాప్తంగా భయంకరంగా విస్తరిస్తోంది.

అమెరికాతో పాటు ప్రపంచమంతటా ఈ వ్యాధి విధ్వంసం సృష్టిస్తోంది.

ఈ విషయాన్ని ప్రజలందరూ తెలుసుకున్నారు. నాకు కూడా అర్థమైంది.

దీనికి కారణమైన చైనాపై నాకు కోపం రోజురోజుకి పెరిగిపోతోంది‘‘ అని ట్రంప్ ట్వీట్ చేశారు. 

ట్రంప్ చేసిన ఈ మాటలు... పాండెమిక్ ప్రభావం తన వైఫల్యంగా ప్రజలు భావించకుండా ఉండాలనేదే ఉద్దేశం. అందుకే ట్రంప్ దానిని ఈ రకంగా వ్యక్తీకరించారు.