గూగుల్ సారీ చెప్పాల్సిందే 

August 11, 2020

ఇంతవరకు అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారందరి కంటే భిన్నమైన వ్యక్తి ట్రంప్. ఈ విషయాన్ని ఆయన అనేకసార్లు నిరూపించారు. ఎప్పటికపుడు తన  ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నాడు. మిగతా అధ్యక్షులతో పోలిస్తే జనాల్లో కలిసేది ఎక్కువ... హుందాతనం తక్కువ. విద్వేషమూ, ప్రేమ ఏది ఎపుడు చూపిస్తాడో తెలియదు. నిర్ణయాలు కూడా అంతే. తాజాగా కరోనా నేపథ్యంలో గూగుల్ ని చెడామడా తిట్టాడు. సారీ చెప్పమని ఆదేశించాడు.

ఇంతకీ విషయం ఏమిటంటే.. కరోనా కట్టడికి సంబంధించిన ప్రభుత్వం  అనేక జాగ్రత్తలు తీసుకుని అదుపు చేయడానికి కృషిచేస్తుంటే... తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయట. దీనికంతటికీ కారణం గూగుల్ సెర్చింజనే అని తేల్చేశాడు ట్రంప్. తప్పుడు వార్తలను గూగుల్ ఎందుకు ప్రచురిస్తుంది? వాటిని గూగుల్ పరిహరించాలి. ఇక ముందు జాగ్రత్త పడాలి. అదే సమయంలో ఇంతవరకు చేసిన తప్పుకు సారీ చెప్పాలి. ’’ఐ యామ్ వెయిటింగ్ ఫర్ దెయిర్ సారీ’’ అని భీష్మించాడు ట్రంప్. ట్రంప్ కి గూగుల్ త్వరగానే రెస్పాండ్ అయ్యింది. ఇది పూర్తిగా జనాలకు కనెక్టై ఉన్న సమస్య కావడంతో కాస్త తగ్గి స్పందించింది. కరోనా వైరస్‌ వ్యాపించకుండా తీసుకునే చర్యల్లో ప్రభుత్వానికి సహకరించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది. ప్రజల్లో అవగాహన పెంచడానికి మా వంతు కృషిచేస్తామని చెప్పింది.  

ఇదిలా ఉండగా... గతంలోనూ గూగుల్‌పై  డొనాల్డ్ ట్రంప్ ఘోరమైన విమర్శలు చేశారు. ఏకంగా యూఎస్‌ ఆర్మీ, రహస్య స్థావరాల వివరాలను చైనాకు చేరవేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు అప్పట్లో.