ట్రంప్ కరోనా టెస్టు రిజల్ట్ ఏమైంది?

August 09, 2020

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ సామాన్యుల నుంచి అసమాన్యుల వరకూ ఎవరిని విడవట్లేదు. ఇప్పటికే ఈ వైరస్ బారిన పలువురు ప్రముఖులు పడిన వైనాన్ని మర్చిపోకూడదు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ అయిన కొందరికి కరోనా పాజిటివ్ అన్న విషయం బయటకు రావటంతో.. ట్రంప్ పరిస్థితి ఏమిటన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ తన ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఇలాంటివేళ.. అమెరికా అధ్యక్షుల వారికి తాజాగా కరోనా టెస్టులు నిర్వహించారు. ఇటీవల బ్రెజిల్ ప్రతినిధి బృందం ఫ్లోరిడా రిసార్ట్ కు రావటం.. అక్కడ ట్రంప్ తో సన్నిహితంగా మెలిగారు. ఆ తర్వాత వారికి కరోనా వైరస్ సోకిన అంశం బయటకు వచ్చింది. దీంతో.. ట్రంప్ కు కరోనా పరీక్షను ముందస్తుగా జరపటం మంచిదన్న వాదన వినిపించింది.
దీనికి తగ్గట్లే.. తాజాగా ట్రంప్ కు కరోనా టెస్టును నిర్వహించారు. తాజాగా దానికి సంబంధించిన రిపోర్టు వెల్లడైంది. కరోనా పరీక్షలో ట్రంప్ సక్సెస్ అయ్యారని.. నెగిటివ్ వచ్చిందని చెబుతున్నారు. ఇప్పటివరకూ కరోనా కారణంగా అమెరికాలో 51 మంది మరణించగా.. పలువురు ఈ మాయదారి వైరస్ బారిన పడుతున్నారు. జాతీయ విపత్తుగా పేర్కొనటమే కాదు.. స్కూళ్లు.. విద్యా సంస్థల్ని మూసివేయటంతో పాటు.. పలు చర్యల్ని చేపట్టారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుల వారికి కరోనా రిజల్ట్ నెగిటివ్ రావటం ఆసక్తికరంగా మారింది.