చౌరస్తా పాటకు... లేడీ కానిస్టేబుల్స్ డ్యాన్సు అదరగొట్టారు... 

August 05, 2020

చౌరస్తా జానపద బ్యాండ్ ఇటీవల యూట్యూబులో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా కరో-నా నేపథ్యంలో వారు పాడిన పాట చాలా కోట్ల మంది వీక్షించారు. సామాజిక మాధ్యమాలు, టీవీ ఛానెళ్లు అన్ని చోట్లా మారుమోగింది. 

అంతటా పాపులర్ అయిన ఈ పాటకు మహిళా పోలీసులు డ్యాన్స్ చేశారు. ఓయూ కళాశాల ప్రాంగణంలో పలువరు మహిళా పోలసులతో పోలీసు విభాగమే చొరవ తీసుకుని ఈ పాట రూపొందించింది. ఇప్పటికే అందరికీ బాగా నచ్చిన పాట కావడం పోలీసు మగువలు డ్యాన్సు అదరగొట్టడంతో ఈ వీడియో బాగా ఫేమస్ అవుతోంది.

ఉస్మానియా పోలీసు స్టేషన్లో పనిచేసే ఓ లేడీ కానిస్టేబుల్ కె.దీనా ప్రతిపాదనను పోలీసులు సాదరంగా ఆహ్వానించి సపోర్ట్ చేయడం గొప్ప విషయం. ఏఎస్ఐ ఎల్ సంజీవరెడ్డి అందరినీ కో ఆర్డినేట్ చేశారు. సిటీలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుళ్లు ఈ పాటకు డ్యాన్స్ చేశారు. మాస్టర్ విశ్వ రఘు దీనికి కొరియోగ్రఫీ అందించారు. 

RELATED ARTICLES

  • No related artciles found