హ్యాట్సాఫ్: తెలంగాణ పోలీసు దశావతారాలు

June 02, 2020

సీన్ 1

ఒక ముస్లిం అబ్బాయి పోలీసులను బండబూడుతులు తిడుతున్నారు. కానీ అతడ్ని కొట్టకుండా తల్లి పోలీసు కాలర్ పట్టుకుని అడ్డుపడుతోంది.పోలీసిన కొట్టింది.. బూతులు తిట్టింది. కానీ ఏ క్షణం కూడా పోలీసు ఆమె మీద చేయి వేయలేదు. సంయమనం.

సీన్ 2.

జనారణ్యంలో జనం లేక నీళ్లు దొరక్క ఓ కాకి సొమ్మసిల్లింది. ఓ పోలీసు కాకి దాహార్తిని తీర్చాడు. సున్నితత్వం.

సీన్ 3.

ఓ వృద్దురాలు రోడ్డు పక్కన ఆకలితో అలమటిస్తోంది. పోలీసు తనకు తెచ్చుకున్న ఆహారాన్ని ఆమెకు అందించాడు. దాతృత్వం.

సీన్ 4.

వలసకూలీలు నిలవ నీడలేక తిండి లేక ఇబ్బంది పడుతున్నారు దాతల సాయంతో వారికి ఆహారం వడ్డించాడు. సామాజిక బాధ్యత.

సీన్ 5.

ఇంటికెళ్లే అవకాశం లేదు. రోడ్డ పక్కనే డ్యూటీ అయ్యాక నిద్ర. చేతినిండా దోమలు. అలసిన శరీరం అయినా నిద్రపోతోంది. నిబద్ధత.

సీన్ 6 

ఇల్లు ఉంది, భార్య ఉంది, కూతురు ఉంది... అందరికీ దూరంగా ఒంటరిగా... సొంత వారిని తలచుకుంటూ డ్యూటీని వదలకుండా భోజనం చేస్తున్న పోలీసు ... వృత్తి పట్ల బాధ్యత..

ఇంకా ఎన్నయినా చెప్పొచ్చు. తెలంగాణ పోలీసు కేవలం సేవకుడు కాదు. ఆ మాటకొస్తే దేశంలో అందరి పోలీసులు ఇపుడు అటు ఇటుగా... సమాజ సేవకుల్లా మారి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. కరోనా రక్కసికి భయపడి ఇంట్లో ఉండానికి ఆపసోపాలు పడుతున్న మనం అన్నీ త్యాగం చేసి విధులకు అంకితమైన వారిని చూసి అయినా మన బాధ్యత గుర్తుతెచ్చుకోవాలి. 

పోలీసులు తమ విధుల్లో ఎలా నిమగ్నమయ్యారో తెలిపే కొన్ని దృశ్యాలు కింద చూడొచ్చు !