ఆర్టీసీ బస్సులు 17 నుంచి ?

August 05, 2020

TSRTC: ప్రత్యేక నిబంధనలతో ఆర్టీసీ బస్సులు 17వ తేదీ నుంచి తెలంగాణలో ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణ సర్కారు ఏర్పాట్లు చేస్తోందని అంటున్నారు. అయితే.. నిబంధనల అమలు మాత్రంగా కఠినంగా ఉంటుంది.

ఎలాంటి జాగ్రత్తలు :

 • నిలబడి ప్రయాణించడం ఉండదు
 • సీట్ల సంఖ్యలో సగం మందికి అనుమతి
 • స్టేషన్లోనే టిక్కెట్లు
 • కండక్టరు ఉండరు. 
 • గ్రీన్ జోన్లలోనే బస్సులు 
 • మాస్కులు ఉన్న వారికే అనుమతి.
 • జిల్లాల బస్సులు హైదరాబాదులోకి రావు. శివారు వరకే వస్తాయి.
 • థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే బస్సెక్కాలి
 • కరోనా లక్షణాలుంటే బస్సు ఎక్కే ఛాన్స్ లేదు
 • బస్సు ఎక్కే విధానంలోను భౌతిక దూరం ఏర్పాట్లు
 • సగం ఆక్యుపెన్సీతో నడిస్తే నష్టాలు వస్తాయి కాబట్టి ఛార్జీలు పెంచే అవకాశం ఉంది

ఈరోజు కేసీఆర్ కరోనా పరిస్థితులపై సమీక్ష చేయనున్నారు. 29 వరకు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో మరి కేసీఆర్ ఎంతవరకు రిస్కు తీసుకుంటారు అనే విషయం తెలియడం లేదు. ఛార్జీలు పెంచే విషయంలో కూడా చర్చ నడుస్తోంది.