ఏకంగా సుప్రీంకోర్టును కెలికిన జగన్

May 29, 2020

జగన్ మందలు మందలు సలహాదారులున్నారు గానీ ఏమీ ప్రయోజనం లేదు. జగన్ కు మంచి సలహాలు ఇచ్చి కాపాడాల్సింది పోయి పనికిమాలిన సలహాలతో బాగా ఇరికిస్తున్నారు. తాజాగా శ్రీవారి భూముల అమ్మకం కేసు ఏపీలోనే కాదు, దేశంలోనే వైరల్ అవుతోంది. జగన్ తప్పటడుగుల్లో ఇదే అతిపెద్దది కానుంది. బహుశా ఈ నిర్ణయంతో వైవీ సుబ్బారెడ్డి పదవికి ఎసరు వచ్చినా ఆశ్చర్యం లేదు.

ఎందుకంటే... శ్రీవారి ఆస్తులను వేలం వేయడానికి టీటీడీ పాలక మండలికి అధికారం ఉండొచ్చు గాని.... మన దేశంలో ఏదైనా ప్రజల సెంటిమెంట్లను కెలకనంత వరకే సక్సెస్ అవుతుంది. సెంటిమెంట్ల జోలికి వెళ్లి బతికి బట్టకట్టినోడు లేడు. శ్రీవారి భూముల అమ్మకం కూడా అలాంటిదే. పైగా తిరుమల శ్రీనివాసుడి సెంటిమెంట్ మన రాష్ట్రంలో కంటే తమిళనాడులో ఎక్కువ. 

జగన్ సర్కారు అమ్ముతున్నది కూడా తమిళనాడులోనే... ఈ వార్త అక్కడ దావానలంలా వ్యాపించి ప్రజల్లో ఆగ్రహానికి గురైంది. ఏకంగా తమిళులే దీనిపై సుప్రీంకోర్టులో దావా వేసే అవకాశమూ లేకపోలేదు. ఇప్పిటికే #TTDForSale అని తమిళులు దీనిని సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ చేస్తూ జగన్ సర్కారును విమర్శిస్తున్నారు. VHP (vishwa hindu parishad), RSS (rashtriya swayamsevak sangh) దీనిపై కచ్చితంగా తీవ్రంగా స్పందిస్తాయి.

ఇవన్నీ ఒకెత్తు అయితే... ఇప్పటికే ఆలయ భూముల గురించి సుప్రీంకోర్టు గతంలో కీలక తీర్పు వెలువరించిందని, టీటీడీ చేస్తున్న ఈ పని ఆగిపోతుందని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ వ్యాఖ్యానంచారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయం అని మండిపడ్డారు. దేవాలయ ఆస్తులను వేలం వేయడం కుదిరే పని కాదన్నారు.  వేలం వేసినా  మళ్లీ కోర్టులో ఎదురుదెబ్బ తప్పదని ఆయన అన్నారు. ఎప్పుడూ కోర్టుల చుట్టూ తిరిగేలా చేసే పనులు మానేసి ప్రజల కోసం చేయాల్సిన పనులపై ప్రభుత్వం దృష్టి సారిస్తే మంచిదని టీజీ వెంకటేష్ హితవు పలికారు.

ఆలయ భూములపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కింద లింకులో చదవొచ్చు.

https://timesofindia.indiatimes.com/india/temples-should-be-managed-by-devotees-not-government-sc/articleshow/68781876.cms