జగన్ నిర్ణయంతో రగిలిపోతున్న వెంకన్న భక్తులు

May 26, 2020

నవ్యాంధ్రకు కొత్తగా సీఎం బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... నిజంగానే కొత్త బిచ్చగాడిలా వ్యవహరిస్తున్నారు. తను తీసుకుంటున్న నిర్ణయాలు సర్వత్రా విమర్శల పాలవుతున్నా కూడా పట్టించుకునే స్థితిలో జగన్ లేదు. ఎదురు దెబ్బలు తగిలినా తగ్గడం లేదు.. ప్రతి విషయంలోనూ తనదైన శైలి తిరోగమన నిర్ణయాలు తీసుకుంటున్న జగన్... చివరకు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికే పంగనామాలు పెడుతున్నట్లుగా ఉన్నారు. అమరావతిలో తిరుమల వెంకన్న ఆలయ నిర్మాణంపై గత టీడీపీ ప్రభుత్వం సదుద్దేశంతో ఓ మంచి నిర్ణయం తీసుకుంటే... ఇప్పుడు తానేదో ఉద్ధరించడానికి వచ్చినట్టుగా టీడీపీ సర్కారు నిర్ణయాన్ని సవరించేస్తున్నారు. అయినా అమరావతిలో అయినా, ఇంకే ప్రాంతంలో అయినా తిరుమల వెంకన్న ఆలయాల నిర్మాణం, వాటి నిర్వహణకు వెచ్చిస్తున్న సొమ్ము సర్కారుది కాదు. జగన్ ది అంతకంటే కూడా కాదు. అది వడ్డీకాసుల వాడి సొమ్మే. దానిపైనా పరిమితులు విధిస్తున్న జగన్ నిర్ణయం చూస్తుంటే... నిజంగానే హిందువులంతా అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

అదేదో తన తాత ముత్తాతలు సంపాదించిన సొమ్ములా ఫీలవుతున్న జగన్... తిరుమల వెంకన్న ఆలయ నిర్మాణానికి పరిమితులు విధిస్తున్నారు. తిరుమల వెంకన్న సొత్తు అంటే... అది భక్తులు స్వామివారికి ఇచ్చిన ముడుపు. అలాంటి ప్రభుత్వ ఖజానా నుంచి తీసిస్తున్నట్లు వ్యవహరిస్తున్న జగన్ వైఖరి చూస్తుంటే... వెంకన్న భక్తులకు నిజంగానే కాలిపోతోంది. అయినా జగన్ ఏం చేశారని వెంకన్న భక్తులు ఇంతగా బాధపడిపోతున్నారన్న విషయానికి వస్తే... వెంకన్న దర్శనాన్ని మరింత మందికి కల్పించే సదుద్దేశంతో, కొత్తగా కడుతున్న రాజధానిలో వెంకన్న ఆలయం ఉంటే బాగుంటుందన్న భావనతో చంద్రబాబు సర్కారు... అమరావతిలో రూ.130 కోట్లతో శ్రీవేంకటేశ్వరుడి గుడి నిర్మాణానికి పూనుకుంది. జనమంతా కూడా ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన నేపథ్యంలో గుడి నిర్మాణం శరవేగంగానే సాగుతోంది.

అయితే తాను సీఎం అయిన వెంటనే ప్రతి నిర్ణయాన్ని తిరగదోడుతున్న జగన్.... ఇప్పుడు వెంకన్న ఆలయానికి రూ.130 కోట్లు ఎందుకు? రూ.30 కోట్లతో సరిపుచ్చేయండని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయినా వెంకన్న ఆలయ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వ సొమ్ము వాడటం లేదు కదా. తిరుమల వెంకన్నకు భక్తిప్రపత్తులతో భక్తులు అందజేసిన విరాళాలతోనే కడుతున్నారు కదా. మరి సర్కారు సొమ్మేదో దుబారా అయినట్టుగా, అంతకంటే కూడా తాను అక్రమంగా సంపాదించిన లక్ష కోట్ల సొమ్ములో కోత పడుతున్నట్లుగా ఫీలవుతున్న జగన్... ఆలయ ఖర్చును అమాంతం తగ్గించేయడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంతటితో ఆగారా? అంటే అదీ లేదు. తన సొంత రాష్ట్రం అమరావతిలో వెంకన్న ఆలయానికి పరిమితులు విధిస్తున్న జగన్... తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ ఖర్చుతో వెంకన్న ఆలయాన్ని నిర్మిస్తారట. ఈ దిశగా టీటీడీ చైర్మన్ గా ఉన్న జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి ఓ సంచలన ప్రకటన చేశారు. ఇక్కడ అమరావతిలో వెంకన్న ఆలయానికి అబ్బాయి పరిమితులు విధిస్తుంటే... అక్కడెక్కడో చెన్నైలో మాత్ర అదే వెంకన్నకు భారీ ఆలయం కడతామని వైవీ చేసిన ప్రకటన చూస్తుంటే... అమ్మకు అన్నం పెట్టలేనోడు... చిన్నమ్మకు బంగారు గాజులు కొనిపెడతానని చెప్పినట్టుగా ఉందని చెప్పక తప్పదు.

ఏపీ భక్తులకు వెంకన్న దర్శనంపై తనదైన శైలి లిమిటేషన్స్ విధిస్తున్న జగన్... తమిళనాట మాత్రం భారీ ఆలయాన్ని నిర్మిస్తారట. నిజంగా ఈ నిర్ణయాలు చూస్తుంటే... జగన్ ను ఓ పిచ్చి తుగ్లక్ గా అభివర్ణిస్తూ టీడీపీ చేస్తున్న ఆరోపణలన్నీ నిజమేనని అనుమానించాల్సి వస్తుంది. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లుగా ఏ ఓక్క నిర్ణయంపైనా క్లారిటీ లేకుండా సాగుతున్న జగన్... అమరావతిలో వెంకన్న ఆలయ నిర్మాణంపై పరిమితులు విధిస్తున్న వైనంపై ఇప్పుడు నిజంగానే ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా తుగ్లక్ నిర్ణయాలపై వెనక్కు తగ్గకుంటే... వెంకన్న భక్తులే జగన్ కు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమేనని చెప్పాలి. ఆ ఏడుకొండల వాడి ఆగ్రహానికి గురయితే అంతే సంగతులు !

కొసమెరుపు - అమరావతి ప్రాంతంలో తిరుమల వంటి ప్రాసస్త్యం కలిగిన మరో ఆలయం వెలిస్తే... కనర్వ్టు అయ్యే వారి పై ప్రభావం తగ్గుతుందని ఏవైనా క్రిస్టియన్ ఆర్గనైజేషన్ల ఒత్తిడి ఏం లేదు కదా? అని అనుమానపు ప్రశ్న వేస్తున్నారు జనం. కొత్త నిర్ణయాలతో మంచి ముఖ్యమంత్రి అనిపించుకోండి. పాత నిర్ణయాలను సవరిస్తే మంచి ముఖ్యమంత్రి కాలేరు వైఎస్ జగన్. జగన్ పెద్దన్న కేసీఆర్ ఏమో చిన్న ఆలయాలను పెద్దవి చేస్తుంటే... తమ్ముడు జగన్ పెద్ద ఆలయాలను చిన్నవి చేయడానికి ప్రయత్నించడం ఏమైనా బాగుందా?