జగన్ మగాడైతే ఆ పనిచేస్తాడు

February 17, 2020

కాంగ్రెస్ నేత తులసి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు తన వాళ్లందరితో జగన్ రాజధాని మార్చడు అని చెప్పించి, తాను కూడా రాజధాని మార్చను అని చెప్పిన జగన్ ఇపుడు రాజధాని మార్చి మోసగాడిలా మిగిలిపోతాడో, అసెంబ్లీ రద్దు చేసి మగాడిలా ఎన్నికలకు పోతాడో తేల్చుకోవాలి అని తులసిరెడ్డి సవాల్ విసిరారు. మాట మార్చి ప్రజలను మోసం చేసి ఎన్నికయ్యి ప్రజలకిచ్చిన మాట తప్పి మోసం చేస్తున్నాడు జగన్ అని ఆయనపై ధ్వజమెత్తారు. ఎన్నికలకు వెళ్లి జగన్ గెలిస్తే రాజధానిని మార్చుకోవచ్చని తులసిరెడ్డి అన్నారు.

గుంటూరులో కాంగ్రెస్ మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. దీనికి తులసిరెడ్డి, మస్తాన్ వలీ పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. జగన్ వి అన్నీ దొంగదారులే అని చెప్పిన తులసిరెడ్డి మండలిని రద్దు చేయాలని చూస్తున్నాడని, ఈ నిర్ణయం తీసుకోవడం అంటే తండ్రికి వెన్నుపోటు పొడవడమే అన్నారు. వైఎస్ శాసనమండలిని పునర్నిర్మిస్తే... కొడుకే దాన్ని రద్దుచేయాలనే ఆలోచన చేయడం మోసం కాదా అని ప్రశ్నించారు.