కరోనా హిందు దేవత- టీవీ9 సెటైర్... రెస్పాండైన పోలీసులు

June 06, 2020

టీఆర్పీ కోసం టీవీ9 చేసిన ప్రయత్నం బూమ్ రాంగ్ అయ్యింది. ఒక సెటైరిక్ షోలో ఓ వ్యాఖ్యాత... అమ్మవారి రూపంలో కరోనాను చిత్రించిన ఫొటోను ప్రింటు తీసి దండాలు పెడుతుంటాడు. మరో వ్యాఖ్యాత... ఏం చేస్తున్నావు, ఏమైంది అని అడిగితే... ’’రాత్రి కరోనా అమ్మవారు నా కలలోకి వచ్చి మూడు రోజులు ఊరవతల టెంటేసుకుని ఉండమని చెప్పారు. అపుడే ఈ ఊరిని వదిలి వెళ్లిపోతాను అన్నారు‘‘ అంటూ చెబుతాడు. అంటే... ఇక్కడ కరోనా ఓ హిందు దేవత అన్నట్టు టీవీ9 చిత్రీకరించింది. ఇది హిందువువల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

కొందరు ట్విట్టరులోనే ఈ వీడియోపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిని సైబరాబాదు క్రైమ్ కి రిపోర్ట్ చేశారు. టీవీ9 ఇలా హద్దులు మీరి జనాలతో ఆడుకోవడం సాధారణ ప్రజలను హర్ట్ చేయడమే అవుతుంది. కొందరు అమాయకులు దీనిని నమ్మే ప్రమాదం కూడా ఉంది. ఇది మూఢ నమ్మకాలను ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది. కాబట్టి వెంటనే దీనిపై పోలీసులు చర్యలు తీసుకుంటే బెటర్. 

మరిపుడు టీవీ9 కి అధికార పార్టీ అండదండలు ఉన్న నేపథ్యంలో కేవలం వీడియో డిలీట్ చేసి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఉంది. అంతకుమించి దీని మీద ఏ చర్యలు తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఇది పక్కన పెడితే జర్నలిస్టులు, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్లు ఇలాంటి మతపరమైన స్క్రిప్టులతో చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది లేకపోతే లేని పోని అశాంతి చెలరేగి సమాజానికి తీరని నష్టం కలుగుతుంది. ఇలాంటి సున్నితమైన అంశాలు ఎంచుకోవడం ఎందుకు? ప్రజల మనోభావాలను దెబ్బతీయడం ఎందుకు?