టీవీ9 చేసిన సిల్లీ తప్పు వైరల్

May 28, 2020

సైన్యం పెద్దదా చిన్నదా అన్నది కాదు... నడిపించే నాయకుడి మార్గదర్శకాలు, ప్లానింగ్ బట్టే విజయం ఉంటుంది. మరి ఒక్కసారికే ఇలా చెప్పడం అంత కరెక్టు కాకపోవచ్చు. అయితే, గతంలో ఎన్నడూ లేనంత చిన్న తప్పుతో ఈరోజు టీవీ9 అబాసు పాలయ్యింది. బహుశా టోటల్ టీం మీద గ్రిప్ ఉన్న వారు ఎవరూ లేకపోవడం వల్ల ఇలా జరిగిందా.. లేకపోతే నిజంగానే ఎవరూ పట్టించుకోరు అని కొత్త బాస్ ను లైట్ తీసుకున్న టీం ఇలాంటి సొంత నిర్ణయాలు తీసుకున్నదా అన్న విషయం తెలియదు గాని... మొత్తానికి చిన్న తప్పు చేసి అబాసు పాలయ్యింది.

తెలుగు ప్రముఖ నటుడు అల్లు అర్జున్.... స్విట్జర్లాండ్ కు సమ్మర్ వెకేషన్ కి వెళ్లారు. ఓ ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ ఫొటోను టీవీ9 తన ట్విట్టరు సోషల్ మీడియా పేజీలో పెట్టి... ఇలా యూరప్ వెళ్లిపోతే షూటింగు షెడ్యూల్ మిస్సవుతుంది. నిర్మాతలు నస్టపోతారు, అందరూ నష్టపోతారు అన్నట్టు అర్థమొచ్చేలా ఒక పోస్టు పెట్టింది. అయితే, అల్లు అర్జున్ పీఆర్ టీం దీనిని గమనించి వెంటనే రిప్లయి ఇచ్చిందట. 

అయ్యా ఇదిగో మీ ఛానెల్లో వచ్చిన వార్తనే మీరు మరిచిపోయారు. నెలక్రితం మీరు ప్రసారం చేసిన ఈ బిట్ చూడండి అని  దానిని పోస్టు చేశారు. అందులో ఏముందంటే... ఏప్రిల్ చివరకు అల్లు అర్జున్ తాజా సినిమా మొదటి షెడ్యూల్ అయిపోయింది. రెండో షెడ్యూలు జూన్ ఫస్ట్ వీక్ లో మొదలవుతుంది అని ఉంది. అయినా అల్లు అర్జున్ వెళ్లింది షెడ్యూల్ గ్యాప్ లోనే. పైగా అతనేమీ అక్కడికెళ్లి సెటిల్ అయిపోలేదు. దీనికెందుకు అంత కంగారు పడతారని రిప్లయి ఇచ్చింది. అయితే, పీఆర్ టీం స్పందనతో వెంటనే ఆ పోస్టును ఛానెల్ డిలీట్ చేసింది. అలాగే వారు పోస్టు చేసిన వీడియో ను కూడా తమ ఫీడ్ లోంచి డిలీట్ చేసింది. అయినా మరీ ఇంత సిల్లీ ప్రశ్న ఎందుకు వేయాలనిపించిందో మరి.