అముల్ పాపకి ట్విట్టర్ షాక్

August 11, 2020

ఈ దేశంలో జరిగే ప్రతి అంశానికి లింకు పెట్టి అముల్ పాపతో కార్టూన్ వేయడం అముల్ డైరీకి అలవాటు. ఇవి బాగా పాపులర్ కూడా. అయితే... దేశ ప్రధాని వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని సైలెంటుగా చేస్తే.. అముల్ నేరుగా బ్యాన్ చైనా, ఎగ్జిట్ ఫ్రం డ్రాగన్ అని నేరుగా చెప్పేసింది. దీంతో ఇదో రకమైన రేసిజం అంటూ ట్విట్టరు అముల్ అక్కౌంట్ ని రెస్ట్రిక్ట్ చేసింది.

దీనిపై ఎక్కువ మంది సంతృప్తి వ్యక్తంచేయగా కొందరు వ్యతిరేకించారు. ఇది సాధ్యం కాదంటూ కొందరు సన్నాయినొక్కులు నొక్కారు. ట్విట్టరు అక్కౌంట్ ను పాక్షికంగా బ్యాన్ చేయడంపై అముల్ కోఆపరేటివ్ సంస్థ మండిపడింది. మాకు సమాచారం కూడా లేదు అంది. అయితే తర్వాత ట్విట్టరు ఆ ట్వీట్ ను లైవ్ చేసింది. 

దీనికి ట్విట్టరు విచిత్రమైన వివరణ ఇచ్చింది. అక్కౌంట్స్ భద్రత మాకు ప్రాధాన్యం. కంటెంట్ గురించి మాకు ఆందోళన లేదు. ఈ ట్వీట్ అముల్ వేసిందా లేదా అక్కౌంట్ ఏమైనా హ్యాక్ అయిందా అన్న ఉద్దేశంతో కేవలం డబుల్ చెక్ కోసం క్యాపచ్చ ఎంటర్ చేయమని అడిగాం అని ట్విట్టరు పేర్కొంది. బ్యాన్ చైనా అనేది కేవలం ఇండియా కాదు. ప్రపంచమంతటా అదే నినాదం. అముల్ అక్కౌంటన్ బ్లాక్ చేయడం అంటే... చైనాకు మద్దతు పలకడమే అని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. 

 

అయినా అముల్ 1966లో స్థాపించబడిన అత్యంత విజయవంతమైన కోఆపరేటివ్ సంస్థ. ఎమర్జెన్సీతో సహా ప్రతి అంశంపై స్పందించడం సర్వసాధారణం. అబ్యూజ్ కంటెంట్ ఉండదు. ప్రస్తుతం ఒక ఇండియన్ కంపెనీగా తాను అలా పేర్కొంది. ఇండియాలో, ఇండియన్ కి ఆ మాత్రం హక్కు ఉంటుంది కదా అన్నది పలువురు నెటిజన్ల వాదన.