స‌మంతపై ట్రోలింగే ట్రోలింగ్

July 14, 2020

ద‌క్షిణాదిన ప్ర‌స్తుత స్టార్ హీరోయిన్ల‌లో మంచి న‌టిగా పేరున్న వాళ్ల‌లో స‌మంత ఒక‌రు. గ‌త కొన్నేళ్ల‌లో ఆమె కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర‌లు చేసింది. రంగ‌స్థ‌లం, మ‌హాన‌టి, మ‌జిలీ, ఓ బేబీ లాంటి సినిమాల‌తో న‌టిగా గొప్ప పేరు సంపాదించింది. అలాంటి న‌టి ఇప్పుడు ఓ పాత్ర‌ను చెడ‌గొట్టేలా ఉందంటూ సోష‌ల్ మీడియా జ‌నాలు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. త‌మిళంలో క్లాసిక్‌గా పేరు తెచ్చుకున్న 96 మూవీ తెలుగు రీమేక్‌లో స‌మంతే క‌థానాయిక‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో త్రిష చేసిన పాత్ర‌లో ఆమె క‌నిపించ‌నుంది. త్రిషకు న‌టిగా అంత మంచి పేరేమీ లేదు కానీ.. 96లో మాత్రం జాను పాత్ర‌లో ఆమె అద్భుత అభిన‌యాన్ని ప్ర‌ద‌ర్శించింది. త‌న‌క‌ది కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అని కూడా చెప్పొచ్చు.
ఐతే లేటెస్టుగా రిలీజైన జాను టీజ‌ర్ చూస్తే.. త్రిష‌తో పోలిస్తే స‌మంత త‌క్కువ‌గానే క‌నిపిస్తోంది. త్రిష‌నే ఈ పాత్ర‌కు ప‌ర్ఫెక్ట్ అనిపిస్తోంది. ఐతే ఏం చేసినా కొంచెం అతిగానే చేసే త‌మిళ అభిమానులు.. త్రిష‌తో పోలుస్తూ స‌మంత‌ను విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు. కొన్ని షాట్ల‌లో ఇద్ద‌రి హావ‌భావాలు ప‌క్క ప‌క్క‌న పెట్టి స‌మంత గాలి తీస్తున్నారు. స‌మంత‌వి ప్లాస్టిక్ ఎక్స్‌ప్రెష‌న్ల‌ని.. ఆమె జాను పాత్ర‌ను చెడ‌గొట్టేసింద‌ని తిట్టిపోస్తున్నారు. ఐతే ఒక క్లాసిక్ మూవీలో ఓ పాత్ర‌కు క‌నెక్ట‌యితే ఇంకొక‌రిని ఆ పాత్ర‌లో ఊహించుకోవ‌డం క‌ష్ట‌మే. ప్రేమ‌మ్ సినిమా రీమేక్ అయిన‌పుడు సాయిప‌ల్ల‌వితో పోల్చి శ్రుతి హాస‌న్‌ను కూడా ఇలాగే ట్రోల్ చేశారు. కానీ తెలుగు వెర్ష‌న్లో శ్రుతిని చూస్తే ఆమె మ‌రీ బ్యాడ్ అనేమీ అనిపించ‌లేదు. రేప్పొద్దున జాను చూవాక స‌మంత విష‌యంలోనూ ఇలాగే ఫీల‌వుతారేమో చూడాలి.