షాక్... ఐ.రా.స. కారులో నడిరోడ్డు మీద సె-క్స్

August 09, 2020

ప్రపంచానికి సుద్దులు చెబుతూ.. అనవసరమైన ఉద్రికత్తలు చోటు చేసుకోకుండా పెద్దన్నలా వ్యవహరించే ఐక్యరాజ్య సమితికి ఉండే మర్యాద.. గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాంటి అత్యున్నత సంస్థకు చెందిన కారులో తాజాగా చోటు చేసుకున్న ఒక ఉదంతం సంచలనంగా మారింది. సదరు సంస్థకు తల కొట్టేసినట్లుగా తయారైంది. సంస్థకు చెందిన కారులో నడి రోడ్డు మీద ఇద్దరు సెక్సు చేసుకుంటున్న వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది.

ఇంతకీ ఈ ఆరాచకం ఎక్కడ చోటు చేసుకుందన్న విషయంలోకి వెళితే.. ఇజ్రయిల్ గా తేల్చారు.  ఆ దేశంలోని ఐక్యరాజ్యసమితికి చెందిన అధికారిక కారులో ఇద్దరు సెక్సు చేసుకుంటున్నవీడియో ఒకటి వైరల్ గా మారింది. ఇంతకీ రోడ్డు మీద ఉన్న కారులో ఈ దరిద్రపుగొట్టు వ్యవహారం జరుగుతుందన్న విషయాన్ని ఎలా గుర్తించారన్న సందేహం వచ్చిందా? అక్కడికే వస్తున్నాం.

రోడ్డు సిగ్నల్ వద్ద యూఎన్ కారు ఆగి ఉండటం.. అలాంటి కార్లను అందరూ ఆసక్తిగా చూడటం తెలిసిందే. అయితే.. సిగ్నల్ ఆగిన సమయంలో.. కారులో ఇద్దరు బరితెగించి మరీ సెక్సు చేసుకుంటున్న వైనాన్ని గుర్తించి.. వెంటనే వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయటంతో ఈ యవ్వారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.

పది సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో వెనుక సీట్లలో ఉన్న యువతి యువకులు మాంచి మూడ్ లో సెక్సు చేస్తుంటే.. బట్టతల ఉన్న వ్యక్తి ఈ వాహనాన్ని డ్రైవ్ చేయటం గమనార్హం.

ఇజ్రాయల్ లోని టెల్ అవిస్ సీ ఫ్రంట్ రోడ్డులో ఈ వీడియోను తీసినట్లు గుర్తించారు.ఈ కారు నెంబర్ ప్లేట్ మీద యునైటెడ్ నేషన్స్ ట్రూస్ సూపర్ విజన్ ఆర్గనైజేషన్ అని ఉన్నట్లు గుర్తించారు. ఈ ఉదంతాన్ని యూఎన్ వో సీరియస్ గా తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఈ దరిద్రానికి పాల్పడిన వారెవరు? అన్న విషయాన్ని గుర్తించే పనిలో పడింది. దీనిపై విచారణను త్వరగా పూర్తి చేసి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. జరిగిన వైనంపై ట్వీట్ తో స్పందించింది. కక్కుర్తి సహజమే కానీ.. మరీ ఇంతా? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.