స్థానిక ఎన్నికల్లో ఆ సీట్లన్నీ టీడీపీవే - ఉండవల్లి

February 22, 2020

వరదల వల్ల ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన బాధితుల్లా... విభజన వల్ల పదవులు, రాజకీయమూ కోల్పోయి నిరాశ్రయులైన కొందరిలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకరు. పైకి న్యూట్రల్ గా కనిపించినా... అతను జగన్ సానుకూల వ్యక్తి అని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. కాకపోతే అపుడపుడు అన్ని పార్టీల గురించి కొన్ని పాజిటివ్ కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టణాల్లో టీడీపీ వైసీపీ కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందని ఉండవల్లి చెప్పుకొచ్చారు. పల్లెల్లో కూడా అమ్మఒడి మాత్రమే జగన్ ను కాపాడగలదని చెప్పారు. ఆయన పూర్తి ఇంటర్వ్యూ కింద వీడియలో చూడొచ్చు.