జగన్ ఫెయిల్డ్ సీఎం అని తేల్చేసిన ఉండవల్లి

May 31, 2020

మేధావిగా.. మంచి మాటకారిగా..  గుర్తింపు పొందడానికి తాపత్రయపడే వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్. జగన్ కు అనధికార సలహాదారుగా వ్యవహరిస్తూ... అప్రమత్తం చేస్తూ ఏం చేస్తే బాగుంటాడో, ఏం చేస్తే పతనం అవుతాడో బాడీ గార్డింగ్ చేస్తుంటారు ఉండవల్లి.  ఏపీ సమస్యలు, పరిస్థితి తెలిసిన జగన్ తప్పులను అన్నింటినీ ఇంతకాలం కవర్ చేసుకుంటూ వచ్చిన ఉండవల్లి అరుణ్ కుమార్ కి రియాల్టీలోకి రాక తప్పలేదు. ఇపుడు కూడా జగన్ కి మద్దతుగా మాట్లాడితే... తనను జనం బూతులు తిడతారని అర్థమై... కొద్దిగా టోన్ మార్చాడు. కానీ అంతలోనే పాపం తెలియదు కదా... మార్చుకుంటే సరిపోతుంది అంటూ కవరింగ్ కూడా చేశారు.

జగన్ ని ఒకడ్నే ఏమైనా అంటే బాగోదనే ఏమో... జగన్ తో పాటు కేంద్రంపై కూడా కొంత కన్నీరు కార్చారు. ’’ఏపీ ఆర్థిక పరిస్థితి మాదిరే కేంద్రం పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు’’ అన్నారు. అంటే జగన్ తప్పేమీ లేదని... ఆర్థిక మాంద్యం ఉంటే జగనేం చేస్తాడు పాపం అని దయార్ద్రంగా మాట్లాడారు. దేశ ఆర్థికపరిస్థితిపై మాజీ ప్రధాని మన్మోహన్ గతంలోనే హెచ్చరించారని.. అప్పుడెవరూ పట్టించుకోలేదన్నారు. కేంద్ర ఆర్థిక పరిస్థితి మాదిరే రాష్ట్ర పరిస్థితి కూడా బాగోలేదని.. ఏపీ పరిస్థితి భయంకరంగా ఉందన్నారు. దీని అర్థమేంటి??? జగన్ వైఫల్యం కొంతే అని చెప్పడం ఉండవల్లి ఉద్దేశం. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత ఈ అంశంపై మరింత స్పష్టత వస్తుందని చెప్పారు ఉండవల్లి. పల్లెత్తు మాట జగన్ ను అనడానికి ఇష్టపడని ఉండవల్లి... ’’రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేవుడున్నాడని తరచూ అంటుంటారని.. ఇప్పుడు ఆ దేవుడే ఆయన్ను ఆశీర్వదించాలి’’ అన్నారు. ఏం జగన్ కి నొప్పి కలిగితే, ఆశీర్వదించకపోతే ఉండవల్లికి వచ్చే నమష్టమేమిటో మరి. గత ప్రభుత్వ సమయంలో ఇలాంటి పాజిటివ్ మాట ఉండవల్లి నోట ఒక్కసారి కూడా రాలేదు.  ఉండవల్లి వ్యాఖ్యలను ఒకసారి విశ్లేషిస్తే...

ఉండవల్లి: ’’రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు‘‘

గత ఐదేళ్లలో ఈ మాట ఏనాడూ ఉండవల్లి అనలేదు అంటే అది అప్పటి పాలకుల సమర్థతే కదా.  జగన్ వచ్చిన 9 నెలలకే రాష్ట్రాన్ని ఆర్థికంగా కుప్పకూల్చాడు అని ఉండవల్లి ఒప్పుకున్నట్లేగా.

ఉండవల్లి: ’బడ్జెట్ లో పోలవరానికి ప్రాధాన్యత ఇవ్వాలి‘

అంటే పోలవరాన్ని గత ప్రభుత్వంలా పట్టించుకోలేదు. గాలికి వదిలేశారు. 
‘‘వైఎస్ కొడుకు మాట తిప్పడు.. మడమ తిప్పడన్న నమ్మకంతోనే ఓట్లు వేశారు‘‘వైఎస్ లాగ జగన్ మాట నిలబెట్టుకోలేదు. నమ్మకాన్ని వమ్ముచేశాడు. మడమ తిప్పాడు అని ఉండవల్లి ధృవీకరించినట్టే కదా.

ఉండవల్లి: గత సీఎం చంద్రబాబు అమరావతికే ప్రాధాన్యం ఇచ్చారు

ఉండవల్లి ప్రకారం... చంద్రబాబు అమరావతిని నిర్లక్ష్యం చేయలేదు అనే అర్థం కదా. మనసా వాచా కర్మణా చంద్రబాబు రాజధానిపై దృష్టిపెట్టారు అని ఒప్పుకున్నట్టేగా మరి. 

కొసమెరుపు ఏంటంటే...ఏడు లక్షల పింఛన్లు రద్దయ్యాయన్న విషయంపై ప్రచారం జరుగుతోంది తప్ప కొత్తగా ఇచ్చిన 14 లక్షల ఫింఛన్లపై ప్రచారం జరగడం లేదని ఉండవల్లి చెప్పారు.  అంటే... జగన్ చెడు చేయలేదు. దుష్ప్రచారం చేయొద్దు. సాక్షి ఈ పనిచేయలేకపోతుంది. జగన్ చాలా మంచి చేశాడు. మీరు అనవసరంగా జగన్ గురించి చెడు మాట్లాడవద్దని ఉండవల్లి రాష్ట్ర ప్రజానీకాన్ని బతిమలాడుతున్నాడు. ​