పాపం ఉండవల్లి !!

August 07, 2020

ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ కు కేసీఆర్ లాగే జనాల్ని మాటలతో గారడీ చేయడం వచ్చు. ఆయన ఎంతలా గారడీ చేసే వారంటే... తాను ప్రభుత్వంలో లేకుండా చేతిలో ఒక్క ఆధారమూ లేకుండా పోలవరంలో భారీ అవినీతి చేసిందని అనేశాడు. 

పోనీ తాను ఏదో ఒక పార్టీ తరఫున వకాల్తాగా ఆ మాట అన్నాడు అంటే రాజకీయం అనుకోవచ్చు. కానీ సామాన్యుడిలా జనాన్ని నమ్మిస్తూ... జనం తరఫున మాట్లాడుతున్నాను అని నటిస్తూ... ఆధారాలు లేకుండా అవినీతి చేసింది అనేయొచ్చా? తప్పు కదా? ఎవరో వెనుక ఉండి నడిపించి నట్టే కదా. 

ఆ రోజు నోటికి వచ్చింది మాట్లాడేసి... ఎస్, చంద్రబాబు అవినీతి చేశాడు, విచారణ జరిగితే జైలుకు పోతాడు అన్నారు. ఇపుడు కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ ఉంది. ఇద్దరు కలిసి తేల్చింది ఏంటి... పోలవరంలో ఏం జరగలేదు అని వెల్లడించారు. అది కూడా స్వయంగా కేంద్ర జలశక్తి శాఖ అధికారికంగా తేల్చి చెప్పింది. ఇంకేముంది ఖేల్ ఖతం దుకాణ్ బంద్. 

 

మరి ఆనాడు అబద్ధం చెప్పిన, అవాస్తవాలు ప్రచారం చేసిన ఉండవల్లిపై ఏం కేసు పెడతారు ఇపుడు?