ఉండవల్లిలో మేల్కొన్న జగన్ స్వామి భక్తి !

August 13, 2020

చంద్రబాబు అధికారంలో ఉంటే... ఏ పాయింటు దొరికితే విమర్శిద్దామా అని తెగ ప్రయత్నం చేస్తుంటారు అఖిల భారత ఆంధ్రా మేధావుల గుంపు. 90 రూపాయలు లిక్కరు బాటిలు వుంటే దాని మీద ప్రెస్ మీట్ పెట్టి ... ఎక్కడ తయారవుతుంది, ఎంత పడుతుంది అంటూ లెక్చర్లు ఇచ్చి 175 రూపాయలున్నపుడు సైలెంటుగా నవ్వి తప్పించకున్న మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్. 

మరో జగన్ ని ఓ మాట అనకపోతే బాగోదేమో అని తమలపాకుతో రెండు చెంపలు వాయించారు. ఇసుక గురించి లోకం కోడై కూశాకా సొంత ఎంపీలు, నేతలు విమర్శించాక ఆల్రెడీ అందరూ గుర్తించినదే కాబట్టి తన ప్రెస్ మీట్ వల్ల కొత్త గా ఎవరికీ నష్టం జరగదని రూఢీ చేసుకున్నాక ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టారు. ఎక్కడ పడితే అక్కడ దాడులు జరిగితే అరాచకాన్ని ఖండించకుండా... చేసిన తప్పులు వేలెత్తిచూపకుండా... అవి చేయకపోతే నువ్వు నెల్సన్ మండేలా అంత గొప్పోడవుతావు అంటూ... జోలపాడి వెళ్లాడు అరుణ్ కుమార్. 

సొంత ఊర్లో బాలికను రేప్ చేస్తే, దళిత యువకుడికి గుండు కొట్టిస్తే ఒక్క మాట మాట్లాడని ఉండవల్లి అరుణ్ కుమార్ అయ్యో మా జగన్ కి ఎవరూ అండగా లేరు. పాపం సాయం చేయండి... అంటూ అందరికీ పిలుపునిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు తాజాగా లేఖ రాసి కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో జగన్ కు బలాన్ని ఇవ్వాలని గట్టిగా ప్రార్ధించారు. 

నిజానికి చంద్రబాబు ఇదే సమయంలో ఉండుంటే... ముఖ్యమంత్రి గారి పాలన ఎలా ఉందంటే.... కరోనాలో మనల్ని దేశంలోనే నెం.1 స్థానంలో నిలబెట్టారు అని సెటైర్లు వేసి తిట్టేవారు. పాపం... జగన్ కదా, అందుకే ఆయనకే అండగా నిలుద్దాం అంటూ వైసీపీ నేత కంటే ఎక్కువగా జగన్ కి భరోసా ఇస్తున్నారు. ఏకంగా దేవుడినే ప్రార్థించాడు. ఇదీ వీరి రాజనీతి... మొదట్నుంచి అత్యంత దారునంగా కరోెనా వ్యాపించిన మహారాష్ట్రలో, ధారావి వంటి బస్తీలో కరోనా కంట్రోల్ చేయగలిగారు. కానీ రూరల్ ఎక్కువగా ఉండే ఏపీ లో ఎన్ని తప్పులు చేస్తే మహారాష్ట్రను దాటిపోయి కేసులు బయటపడతాయి. ఇంతకుమించిన వైఫల్యం ఏముంటుంది?