గోదావరి నీళ్లు.. నోరెత్తని ఉండవల్లి - ఇరికించిన ఎన్నారైలు

July 14, 2020

ఉండవల్లి తనకు తాను రాజకీయాలకు పెదరాయుడులా, ఏపీకి సంరక్షకుడిలా ఫీలై పోతుంటారు. తనకు నచ్చని వ్యక్తులు తప్పులు చేస్తే బయటపెడతాడు. మంచి చేస్తే మాట్లాడడు. కానీ తనకు నచ్చిన జగన్, వైఎస్ వంటి వారి తప్పుల గురించి నోరు తెరవడు. పోలవరంలో అన్యాయం జరుగుతోంది, అవినీతి జరుగుతోందని ఆరోపించిన ఉండవల్లి ... కేంద్రం అక్కడ అవినీతే లేదని చెబితే బయటకు రాకుండా కలుగులో దాక్కున్నాడు. అంటే జగన్ కు సాయ పడటం కోసం చంద్రబాబు తప్పులను రోజుకోసారి ప్రెస్ మీట్ పెట్టి... సొంత ఖర్చులతో మీడియాకు టీ బిస్కెట్లు ఇచ్చి ఉండవల్లి అరుణ్ కుమార్ ఏమి ఆశించారు. పైకి మాత్రం రాష్ట్ర క్షేమం. టార్గెట్  మాత్రం బాబు ఓటమి. 

ధారాళంగా తెలుగు రావడం వల్ల తన లాజిక్కులతో అందరినీ నమ్మిస్తుంటారాయన.అన్నీ నిజాలే చెప్పేవాడయితే... విభజనకు ముందు అంతర్గతంగా కాంగ్రెస్ ఏం జరిగిందో ఏమీ బయటపెట్టరు. కాంగ్రెస్ నేత గా వైఎస్ అనుయాయుడిగా జగన్ చేసిన తప్పులు, అతని క్యారెక్టరు ఎంతో కొంత ఉండవల్లికి తెలియకుండా పోదు. కానీ ఏనాడైనా నోరు విప్పాడా? విప్పడు. ఎంతో మంది కాంగ్రెస్ నేతలు, చివరకు ఇపుడు వైసీపీలో ఉన్న బొత్స కూడా జగన్ అరాచకవాది అన్నాడు. మరి ఉండవల్లి తనకు తెలిసిన నిజాలను ఎందుకు చెప్పడు? అదే మరి వ్యూహం. ఆయన రాజకీయాల్లోకి రావడం వల్ల కొత్తగా ఒరిగేదేమీ ఉండదు. అదే పెదరాయడు గెటప్ లో నీతులు చెబుతూ జగన్ కు మేలు చేస్తూ ఉంటే... ఇద్దరికీ లాభమే కదా. అందుకే వ్యూహాత్మకంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఉండవల్లి.

ఏపీ రక్షకుడిగా తనకు తాను ఫీలయ్యే ఈ పెద్ద మనిషి మన వాటా గోదావరి నీళ్లను తెలంగాణకు దారాదత్తం చేస్తుంటే ఎందుకు సైలెంటుగా ఉన్నారు. జగన్ కి నష్టమనే కదా. అంటే జగన్ బాగుంటే చాలు రాష్ట్రం మునిగిపోయినా పర్వాలేదా ఉండవల్లి గారూ? మరి అమాయకంగానో అతితెలివిగానో ఉండవల్లికి లేఖ రాసి కరెక్టుగా ఇరికించారు ఎన్నారైలు. 

ఇటీవ‌ల తెలంగాణ నుంచి గోదావ‌రి జ‌లాల్ని శ్రీ‌శైలం ప్రాజెక్టులోకి ఎత్తిపోసి.. రెండు తెలుగు రాష్ట్రాలు వాడుకోవాలంటూ తెర మీద‌కు వ‌చ్చిన ప్రాజెక్టు ఎవ‌రికి లాభం.. ఎవ‌రికి న‌ష్టం అన్న విష‌యాన్ని చెప్పాల్సిందిగా ఉండ‌వ‌ల్లిని కోరుతూ తాజాగా ప్ర‌వాసాంధ్రులు ఒక బ‌హిరంగ లేఖ రాశారు. ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం త‌పించే వ్య‌క్తిగా మీరంటే మాకు ఎంతో గౌర‌వం. విభ‌జ‌న స‌మ‌యంలోనూ ఆ త‌ర్వాతి ప‌రిణామాల్లోనూ మీ భావ‌జాలం సుప్రీంకోర్టు త‌లుపు త‌ట్టిన మీ క్రియాశీల‌త చూసి మీరంటే గౌర‌వం మ‌రింత పెరిగింది. కొద్దిరోజులుగా విభ‌జ‌న చ‌ట్టంలోని కొలిక్కి రాని అంశాలు.. గోదావ‌రి జ‌లాల్ని శ్రీ‌శైలానికి త‌ర‌లించే కొత్త ప్ర‌తిపాద‌న‌లు ఏపీ రాష్ట్ర ప్ర‌యోజ‌నాలకు విఘాతం క‌లిగిస్తాయ‌న్న అనుమానం ప్రజల్లో ఉంది. మీలాంటి మేధావులు ఈ అంశంపై రియాక్ట్ కావాలి. లాభ న‌ష్టాల్ని చ‌ర్చించాలి. ఇది రాష్ట్రానికి మేలు జ‌రుగుతుందా?  కీడు చేస్తుందా? అన్న విష‌యంపై మీ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేయాలని వారు కోరారు. పాపం ఉండవల్లి... ఇపుడు ఏమంటాడో చూడాలి. చెప్పకపోతే ప్రజలకు కోపం, చెబితే జగన్ కు కోపం ఎలా రియాక్టవుతారో చూడాలి !!