కలకలం: మోహన్ బాబు ఇంటికెళ్లి బెదిరించారు

August 13, 2020

గుర్తుతెలియని దుండుగులు నటుడు మోహన్ బాబు ఇంట్లోకి దూసుకెళ్లి ఆయనను బెదిరించారు. తాజాగా జరిగిన ఈ ఘటన కలకలం అయింది. కొందరు వ్యక్తులు ఇన్నోవా కారులో వచ్చి ఇంటి కాంపౌండ్లోకి దూసుకెళ్లారు. ఏయ్ మోహన్ బాబు నిన్ను వదలం అంటే ఇంటిముందే బెదిరించారు. వారు ఎవరన్నదీ తెలియదు, మోహన్ బాబు అక్కడికి చేరుకునేలోపు వాళ్లు వెళ్లిపోయారు. దీంతో వారు ఎవరన్నదీ క్లారిటీ లేదని తెలుస్తోంది.

ఈ ఘటనపై మోహన్ బాబు కుటుంబం ఆందోళన చెందుతోంది. వారు పహడీషరీఫ్ పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు ఇచ్చారు. దీనిపై పోలీసులు ఆరాతీస్తున్నారు. ఇంత శత్రుత్వం ఎవరికీ తనతో లేదని, అందుకే వారు ఎవరో తెలియడం లేదని అంటున్నారు. ఇదిలా ఉండగా... చాలాకాలం క్రితమే మోహన్ బాబు శివారులో ఉన్న శంషాబాద్ కు కుటుంబాన్ని షిఫ్ట్ చేశారు. పొలాల మధ్య అక్కడ ఒక భారీ భవంతిని నిర్మించుకున్నారు. వారికి హైదరాబాదులోను నివాసం ఉన్నా... ఎక్కువ కాలం అక్కడే గడుపుతున్నారు. అవసరం ఉంటేనే నగరంలోకి వస్తున్నారు. ఇరుగు పొరుగు కూడా అక్కడ ఎవరూ లేరు. వారి ఇల్లున్న ప్రాంతం పహాడీషరీఫ్ పోలీస్ స్టేషను పరిధిలోకి వస్తుంది. అందుకే అక్కడ ఫిర్యాదు చేశారు. 

కారు నెంబరు మాత్రం తెలిసింది. ఏపీ 31 ఏఎన్‌ 0004 ఇన్నోవా కారులో దుండగులు వచ్చినట్లు సమాచారం. దీనిని బట్టి త్వరలో ఎవరన్నదీ తెలిసే అవకాశం ఉంది. ఇది ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యవహారమా? సినీ నిర్మాణ వివాదమా? అన్నది తేలాల్సి ఉంది.

Read Also

మదనపల్లె రైతు - ప్రియాంక చోప్రా కామెంట్
షాకింగ్- కరోనాతో ఏపీ బీజేపీ నేత మృతి
విశాఖకు ఏమైంది? ఎందుకు వరసగా... ఈసారి 10 మంది మృతి