బీజేపీ పాలనలో బీజేపీ ఎమ్మెల్యేకు జీవిత‌ఖైదు.. ఎలా?

June 02, 2020

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన కేసులో వివాదాస్ప‌ద ప్ర‌జాప్ర‌తినిధికి దిమ్మ‌తిరిగే షాక్ త‌గిలింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తాపార్టీ త‌మ పార్టీ నేత‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డంత ఆయ‌న‌కు జీవిత‌ఖైదు ప‌డింది. ఆయ‌న మ‌రెవ‌రో కాదు...ఉన్నావ్ అత్యాచార కేసులో దోషిగా తేలిన యూపీకి చెందిన బీజేపీ బ‌హిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌. 16 ఏళ్ల అమ్మాయిపై ఎమ్మెల్యే కుల్దీప్ 2017, జూన్ 4న ఉన్నావ్‌లో రేప్ చేశాడు. ఈ కేసులో జ‌రిగిన వాద‌న‌ల అనంత‌రం తాజాగా ఆయ‌న‌కు జీవిత‌ఖైదు శిక్ష‌ను విధించింది ఢిల్లీ హైకోర్టు.
ఓ యువ‌తిని రేప్ చేసిన కేసులో  2017లో ఎమ్మెల్యే కుల్దీప్ సింపీ పై బీజేపీ స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. దీంతోపాటుగా, సీబీఐ విచార‌ణకు ఆదేశించింది. సెంగార్‌కు వీలైనంత భారీ శిక్ష వేయాల‌ని సీబీఐ కోర్టును కోరింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లక్నో కోర్టు నుంచి ఢిల్లీ కోర్టుకు కేసును బదిలీ చేశారు. ఈ కేసు ఢిల్లీ కోర్టుకు ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన బదిలీ కాగా, నాటి నుంచి రోజు వారీ విచారణ చేపట్టారు. ఐపీసీలోని సెక్ష‌న్ 376(2) ప్ర‌కారం శిక్ష‌ను ఖ‌రారు చేశారు. సోమవారం రోజు కోర్టు సెంగార్‌ను దోషిగా తేల్చినా.. శిక్ష‌ను వాయిదా వేసింది. త‌న‌నుదోషిగా ప్రకటించడంతో.. ఆయన కోర్టు హాలులోనే బోరున విలపించారు. కాగా, కేసులో మరో నిందితుడైన శశి సింగ్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించిన విష‌యం తెలిసిందే.
ఈ కేసులో తుది తీర్పును వెలువ‌రించిన  జిల్లా జ‌డ్జి ధ‌ర్మేశ్ శ‌ర్మ ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే సెంగార్‌కు 25 ల‌క్ష‌ల జ‌రిమానా కూడా జ‌డ్జి విధించారు. ప‌ది ల‌క్ష‌లు బాధితురాలికి, 15 ల‌క్ష‌లు ప్రాసిక్యూష‌న్‌కు ఇవ్వాల‌ని ఆదేశించారు. బాధితురాలికి స‌రైన ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోర్టు సీబీఐని ఆదేశించారు.