పాలిట్రిక్స్: ఊహించింది వేరు, జరిగింది వేరు

May 26, 2020

బద్ధ శత్రువులైన బీఎస్పీ, ఎస్పీ పార్టీలు పొత్తు పెట్టుకున్న వెంటనే అది దేశంలో ఒక సంచలనం అంటూ మీడియా కోడై కూసింది. రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోయారు. ఇది మామూలు సంచలనం కాదు.. రెండు జాతీయ పార్టీలు, అది కూడా భారీ పార్టీలు ఒక్కటయ్యాయి. అసలు ఈ రెండు పార్టీలు ఓట్లు కలిస్తే గతంలో 71 స్థానాలు సాధించిన బీజేపీ ఈసారి 20 స్థానాలకు పడిపోయినా ఆశ్చర్యం లేదంటూ విశ్లేషణలు సాగాయి. కట్ చేస్తే... గతంలో కంటే సీట్లు తగ్గినా 64 స్థానాలు సాధించి రికార్డు సృష్టించింది బీజేపీ. వాస్తవానికి అంత పెద్ద రాష్ట్రంలో రెండు ముఖ్య పార్టీల పొత్తు నేపథ్యంలో 64 సీట్లు సాధించడం బీజేపీ అసాధారణ విజయమే.
మరి ఇదెలా జరిగింది? పొత్తు ఎందుకు ఫెయిలయ్యింది?
ఎందుకంటే... ఐడియా కంటే పని గొప్పది,
పొత్తు పెట్టుకోవడం కంటే అది వర్కవుట్ చేయడం గొప్ప విషయం. ఎస్పీ, బీఎస్పీ పొత్తు చాలా మందికి విశ్వసనీయ పొత్తు అనిపించలేదు. అందులో కేవలం అధికార కాంక్ష మాత్రమే ఓటర్లకు కనిపించింది. పైగా పైగా కాంగ్రెస్ ను కలుపుకోకపోవడం కూడా బీజేపీకి పరోక్షంగా ఉపయోగపడింది. 2014 ఎన్నికల్లో కనీసం ఖాతా తెరవని బీఎస్పీ 10 స్థానాలను ఈసారి సాధించడం విశేషం. ప్రధాని పదవి అభ్యర్థిగా దేశమంతటా తిరిగిన మాయావతికి ఇతర పార్టీ పొత్తుకు వచ్చినా మాయావతి పదిసీట్లతో సంతృప్తి పడ్డారు. ఎస్పీ, బీఎస్పీ పొత్తు క్షేత్రస్థాయిలో ఫలితం ఇవ్వలేదు. ఆ పొత్తు సక్రమంగా పనిచేసినట్లయితే బీజేపీ అడ్రెస్ లేకుండా పోయేది. లేకపోతే పరిస్థితి మరోరకంగా ఉండేది. ఇక క్షేత్ర స్థాయిలో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరికొకరు విశ్వాసంగా పనిచేయలేదు. పలుచోట్ల ’’మా ఒక్క సీటు పోయినాపర్లేదు ఆ పార్టీని ఓడించాలని ఎస్పీ - బీఎస్పీ శ్రేణులు ఒకరికి ఒకరు అన్యాయం చేసుకున్నాయి. దీంతో ఈ పొత్తు వల్ల కొన్ని ఓట్లు బీజేపీకి పడినట్టు తెలుస్తోంది.

ఇతర పార్టీల ముఖచిత్రం
ఇక్కడ కాంగ్రెస్ సింగిల్ గా పోటీకి వెళ్లి... సింగిల్ సీటే గెలిచింది. అమేథీలో రాహుల్ ఓడిపోగా, రాయ్ బరేలీలో సోనియా గెలిచింది. 5 సీట్లు ఎస్పీకి, 10 సీట్లు బీఎస్పీకి, 64 సీట్లు బీజేపీకి దక్కాయి.
ఇక బీజేపీ అన్ని అడ్డంకులను అవలీలగా అధిగమించి మంచి ఫలితాలను సాధించింది. ఏటా రైతులకు ఆరువేలు ఆర్థికసాయం ఆకట్టుకుంది. ఈబీసీలకు పదిశాతం రిజర్వేషన్లు వర్కవుటయ్యాయి. ట్రిపుల్ తలాక్ నిషేధం సానుకూల ఫలితాన్నే ఇచ్చింది. హిందుత్వ నినాదం ఎలాగూ ఉండనే ఉంది. బీజేపీ ఈసారి ఒక ముస్లిం అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చింది. బాలాకోట్ దాడులు, జాతీయ భద్రతకు సంబంధించిన అనేక అంశాలు బీజేపీకి మేలు చేశాయి.