కోటి రూపాయల పంతులమ్మ... మాయావి 

August 10, 2020

ఒక టీచర్ గవర్నమెంటు నుంచి 13 నెలల్లో కోటి రూపాయల జీతం డ్రా చేసిందంటే మీరు నమ్ముతారా? మీరే కాదు... జీతం ఇచ్చిన వారే నమ్మడం లేదు. కానీ ఇది పచ్చినిజం. ఇది ఆమెకు ఎలా సాధ్యమైందో తేల్చడానికే అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 

ఉత్తర ప్రదేశ్ కి చెందిన అనామిక శుక్లా అనే ప్రభుత్వ టీచరు 25 స్కూళ్లలో జీతం డ్రా చేసింది. ఆమె పోస్టింగేమో కస్తూర్బా బాలిక విద్యాలయ. సైన్స్ టీచరుగా పనిచేస్తున్న అనామిక క్రిమినల్ తెలివితేటలతో 13 నెలలుగా అందర కళ్లు కప్పి 25 స్కూళ్ల నుంచి జీతం తీసుకుంటోంది. హైలెట్ ఏంటంటే.... బయోమెట్రిక్ యంత్రాలకు కూడా దొరక్కుండా ఆమె మాయ చేసింది.

ఇపుడు కూడా బయటపడేది కాదు. టీచర్ల డేటాబేస్ ను సిద్ధం చేస్తుండగా... 25 స్కూళ్లలో ఒకటే పేరు కనిపించడంతో అధికారులకు అనుమానం వచ్చి సరిపోల్చగా విషయం వెల్లడైంది. అన్ని స్కూళ్లలో ఆమె రికార్డులుండటం అందరినీ ఆశ్చర్య పరిచింది. 

అసలు ఆమె సంపాదించిన కోటి రూపాయల కంటే కూడా బయోమెట్రిక్ ను ఎలా మాయ చేసింది అనే దాని ఆధారంగా దర్యాప్తు సాగుతోంది. ఇపుడు దేశమంతటా అనామిక టాక్ ఆఫ్ ద టౌన్.