అందరినీ ఒక్కసారి భయపెట్టిన ఉపాసన

August 04, 2020

చెప్పేటపుడు క్లారిటీ ఉండాలి. అపోలో హాస్పిటల్ వైస్ ఛైర్మన్ అయిన ఉపాసన కామినేని ఈరోజు వేసిన ట్వీట్ హైదరాబాదీయులను భయభ్రాంతులను చేసింది. తన ఆస్పత్రి క్రెడిట్ కోసం ఆమె చేసిన ప్రయత్నం కొంచెం మిస్ ఫైర్ అయ్యింది. దీంతో హైదరాబాదు ఉలిక్కిపడింది. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసుకుందాం.

’’సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్ ఒక కరోనా కేసును డిటెక్ట్ చేసింది. మా దగ్గర ఉన్న అత్యాధునిక స్క్రీనింగ్ టెక్నాలజీ వల్ల ఇది సాధ్యమైంది. ప్రస్తుతం ఆ పేషెంట్ గాంధీ ఆస్పత్రిలో ఉన్నారు. పౌరులు బాధ్యతగా వ్యవహరించి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోండి‘‘ అని ఉపాసన ట్వీట్ చేశారు. అయితే... రెండు గంటల క్రితం ఆమె ఈ ట్వీటు వేయడంతో హైదరాబాదులో ఇంకో కొత్త కేసు నమోదైంది అని జనం భయపడ్డారు. ఆమె ట్వీట్లో క్లారిటీ లేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. మొన్న బెంగుళూరు నుంచి వచ్చి గాంధీలో చేరిన మొదటి కరోనా కేసు, ఉపాసన చెప్పిన కేసు ఒకటే. కాకపోతే ఆమె ఆలస్యంగా ట్వీట్ చేయడం, అపోలో కనిపెట్టింది అని చెప్పడం వల్ల ఇది వేరే కేసు అనుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఆందోళన మొదలైంది. అయితే... ఆ కేసు, ఈ కేసు ఒకటే అని తేలడంతో ఊపిరిపీల్చుకున్న పరిస్థితి. 

అనేక మంది నెటిజన్లు ఆమె ట్వీటు కింద... ఇది కొత్త కేసా? అని అడుగుతున్నారు. వారి ప్రశ్నల తర్వాత కూడా ఆమె  రిప్లయి ఇవ్వకపోవడం గమనార్హం. అయితే, కొంతమంది ఇతర నెటిజన్లే ఇది పాత కేసు అని తేల్చారు. క్రెడిట్ కోసం ఉపాసన పాకులాడి కన్ఫ్యూజ్ చేస్తోందని క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి... మా జాగ్రత్తలు తర్వాత ముందు మీరు క్లారిటీగా ఉండండి ఉపాసన గారు.