పాకిస్తానీ పౌరుడితో ఉపాసన షికారు

August 02, 2020

వెంటనే తప్పుగా అర్థం చేసుకోకండి.

మేము చెప్పింది అక్షరాల నిజమే గాని ఆ పౌరుడి వయసు ఏడాదే. 

లండన్ లో క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లిన ఉపాసన కామినేని అక్కడ సానియా మీర్జాతో కలిసి లండన్ లో షికారు చేశారు. సానియా మీర్జా కొడుకు ఇజ్జుతో ఆమె ఫొటోలు దిగి ట్విట్టరులో షేర్ చేశారు. వీరితో పాటు అజహర్ కొడుకు సానియా మీర్జా చెల్లెలు కూడా ఉన్నారు. 

హైదరాబాదీ అయిన టెన్నిస్ తార పాకిస్తానీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అనేక అంశాలపై ఆమె పలు విమర్శలను ఎదుర్కొంది. కానీ అటు పాకిస్తానీగా, ఇండియన్ గా ద్విపాత్రాభినయంలో నెట్టుకువస్తోంది సానియా మీర్జా. తాజాగా సానియా రాంచరణ్ అర్థాంగి అపోలో ఆస్పత్రి నిర్వహకురాలు అయిన ఉపాసనతో రోజంతా గడిపారు. లండన్ వీధుల్లో తిరుగుతూ షాపింగ్ చేశారు.

ఈ ట్రిప్ లో సానియా చెల్లెలు ఆనమ్, తన బాయ్ ఫ్రెండ్ అయిన అజారుద్దీన్ కొడుకుతో కూడా ఉన్నారు. వీరు నలుగురు కలిసి లండన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫొటోలే ఇవి.