ఈ అమ్మాయి కోస‌మే సినిమా చూసేలా ఉన్నారు..

August 08, 2020

ఓ కొత్త క‌థానాయిక కోసం ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూడ‌టం.. త‌న కోస‌మైనా థియేట‌ర్ల‌కు వెళ్లి ఓ సినిమా చూడాల‌ని అనుకోవ‌డం అరుదుగా జ‌రుగుతుంటుంది. ప‌దేళ్ల కింద‌ట స‌మంత కోసం ఇలాంటి ఆరాటం క‌నిపించింది కుర్రాళ్ల‌లో. ఇలా మ‌రికొంద‌రు అమ్మాయిలు ఆస‌క్తి రేకెత్తించారు. ఇప్పుడు కృతి శెట్టి అనే కొత్త‌మ్మాయి కూడా ఇలాగే ఎగ్జైట్ చేస్తోంది తెలుగు ప్రేక్ష‌కుల్ని. ఉప్పెన సినిమాతో క‌థానాయిక‌గా ప‌రిచ‌యం కానున్న అమ్మాయి కృతి. ఈ అమ్మాయి ప్రి లుక్ ద‌గ్గ‌ర్నుంచి ప్రేక్ష‌కుల్లో ఒక క్యూరియాసిటీ క‌నిపిస్తోంది. ఇటీవ‌ల ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి రెండు పాట‌ల్ని రిలీజ్ చేసిన చిత్ర బృందం.. కృతి కోసం కుర్రాళ్లు వెర్రెత్తిపోయేలా చేసింది. 

పెద్ద క‌ళ్లు.. చ‌క్క‌టి హావ‌భావాల‌తో ఈ అమ్మాయి ఫ‌స్ట్ ఇంప్రెష‌న్లోనే అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. కొత్త‌మ్మాయి అనే ఫీలింగ్ రాకుండా అనుభ‌వ‌మున్న అమ్మాయిలా హావ‌భావాలు ప‌లికించి ఆక‌ట్టుకుంటోందీ అమ్మాయి. పాట‌ల ప్రోమోల్లో కృతి చురుకుత‌నం భ‌లేగా ఆక‌ట్టుకుంటోంది. ఈ అమ్మాయి గురించి నెటిజ‌న్లు అప్పుడే డిస్క‌ష‌న్లు పెట్టేశారు. హీరోయిన్ల‌ను భ‌లేగా చూపించే సుకుమార్‌కు త‌గ్గ‌ట్లే ఆయ‌న శిష్యుడు బుచ్చిబాబు కూడా త‌న తొలి సినిమా కోసం భ‌లే అమ్మాయిని ప‌ట్టుకొచ్చాడ‌ని అంటున్నారు. ఈ అమ్మాయి కోస‌మైనా సినిమా చూడాలంటూ ట్విట్ట‌ర్లో కుర్రాళ్లు మెసేజ్‌లు పెడుతుండ‌టం విశేషం. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాణంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా న‌టించాడు. ఏప్రిల్ 2న ఉప్పెన థియేట‌ర్ల‌లోకి దిగుతుంది. 

 Image

Image