సూపర్ హాట్ గర్ల్ ... గౌను సర్దడానికి నలుగురు

August 04, 2020

అందరిలోకి భిన్నంగా కనిపించాలి. కార్యక్రమానికి వచ్చే వారి కళ్లన్ని మన చుట్టూనే తిరగాలి. అందుకోసం ఎంత కష్టమైనా.. ఇబ్బంది అయినా హోయలు ఒలికించేందుకు ఏ మాత్రం వెనుకాడరు ముద్దుగుమ్మలు. ఇటీవల జరిగిన ఫిలంఫేర్ అవార్డుల ఫంక్షన్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతాలా సమ్ థింగ్ స్పెషల్ గా కనిపించేందుకు పడిన శ్రమ చూస్తే అవాక్కు అవ్వాలి. తాజాగా తానెలా రెఢీ అయి అవార్డు ఫంక్షన్ కు వెళ్లానన్న విషయం అర్థమయ్యేలా పొట్టి వీడియో ఒకటి పోస్టు చేశారు.

ఈ అవార్డు ఫంక్షన్ కు బాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది వచ్చినా.. అందరి కళ్లు తన మీద పడేలా చేయటంలో ఊర్వశీ సక్సెస్ అయ్యారు. ఏడేళ్ల క్రితం సింగ్ సాబ్ గ్రేట్ సినిమాలో తళుక్కుమన్న ఈ కొత్త అందం బాలీవుడ్ గా బాగానే పాగా వేసింది.
మిగిలిన వారికి భిన్నంగా హోయలు ఒలికించటంలో తనకు మించినోళ్లు లేరన్న విషయాన్ని తాజా ఫిలింఫేర్ లో ఫ్రూవ్ చేసేసింది కూడా. ఎర్రగులాబీల్ని తలపించేలా భారీ బుట్ట గౌను ధరించిన ఆమె.. వయ్యారంగా నడుచుకుంటూ అవార్డు కార్యక్రమం జరిగే హాల్లోకి వచ్చినంతనే.. అందరూ ఆమెను విచిత్రంగా చూసేసిన పరిస్థితి. నడుము కింది నుంచి.. భారీగా ఉన్న ఫ్లర్ తో.. ఉన్న ఈ వెరైటీ గౌను డిజైన్ చేయటానికి ఏకంగా 730 గంటలు పట్టిందట.
ఆమె కుర్చీలో కూర్చున్న తర్వాత.. గౌను సరి చేయటానికే నలుగురుసహాయకులు అవసరమయ్యారు. తాజాగా ఆమె ధరించిన గౌను సోషల్ మీడియాలో స్పెషల్ గా మారింది. మరి.. మీరు కూడా ఒక లుక్ వేయండి.