మీడియాకు వార్నింగ్‌ ఇచ్చిందే !

July 03, 2020

బాలీవుడ్ న‌టి ఊర్వ‌శి రౌతేలాకి కోపం వ‌చ్చింది. ఒక మీడియా సంస్థ‌లో అచ్చు అయిన వార్త విష‌యంలో ఆమె తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. గ‌తంలో టీమిండియా స‌భ్యుడు క‌మ్ ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్య‌తో డేటింగ్ చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. వారిద్ద‌రూ చెట్టాప‌ట్టాలేసుకొని లేట్ నైట్ పార్టీల‌కు జోరుగా వెళ్లేవారు. దీంతో.. వారిద్ద‌రి మ‌ధ్య ఏదో ఉందంటూ వార్త‌లు త‌ర‌చూ వ‌చ్చేవి.
ఇదిలా ఉంటే.. గ‌డిచిన కొద్ది కాలంగా వారిద్ద‌రి మ‌ధ్య దూరం పెరిగింది. ఇప్పుడు ఎవ‌రి దారిన వారు ఉంటున్నారు. ఇలాంటివేళ‌.. ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ ప్ర‌చురించిన వార్త‌లో హార్దిక్ ను ఉద్దేశించి మాజీప్రియుడుగా పేర్కొన్నారు. దీనిపై ఊర్వ‌శి మండిప‌డింది. ఇలా పిచ్చి రాత‌లు రాస్తారా? అంటూ ప్ర‌శ్నించారు
మీడియా ఛాన‌ళ్ల‌కు.. ప‌త్రిక‌లు ఇలాంటి పిచ్చి వార్త‌లు వేయొద్ద‌ని వేడుకుంటున్నా..  ఇలాంటి వాటి వ‌ల్ల ఇంట్లో గొడ‌వ‌లు అవుతాయ‌ని.. రేపు ఏదైనాజ‌రిగితే త‌న కుటుంబానికి తానేం చెప్పుకోగ‌ల‌ద‌ని ప్ర‌శ్నించారు. ఇంత‌కీ.. స‌ద‌రు మీడియాలో వ‌చ్చిన వార్తేమంటే.. ఊర్వ‌శి త‌న మాజీ ప్రియుడ్ని హెల్డ్ అడిగారా? అంటూ వార్త‌పై ఇంతలా ఫైర్ అయ్యారు.