ఇండియా బలం రెట్టింపు - అమెరికా కీలక ప్రకటన

August 14, 2020
CTYPE html>
యుద్ధం ఆలోచన రాగా చైనాకు ఓటమి భయం కల్పిస్తున్నాయి ప్రపంచ దేశాలు. చైనా చేసిందే పెంటపని. వైరస్ తో ప్రపంచాన్ని అతలకుతలం చేసింది. దానికి క్షమాణ చెప్పడం లేదు. గిల్టీగా ఫీల్ కావడం లేదు. పైగా యుద్ధానికి సై అంటోంది. ఇప్పటి వరకు యుద్ధాలే చేయని చైనాకు అంతుంటే... ప్రపంచంలో ఎన్నో యుద్ధాలను తిప్పి కొట్టిన భారత్ కు, ఆయా దేశాల్లోకే వెళ్లి వాటిని గడగడలాడించిన అమెరికాకు ఎంతుండాలి. ఇక్కడ ఎవరూ చేతులు ముడుచుకుని కూర్చునే వాళ్లు లేరు. 
 
వాస్తవానికి చైనాది యుద్ధం కాదు. ఆశ, ఆక్కసుతో కూడిన ఆవేశం. ఇకపై తన దేశంలోని పెట్టుబడులను ప్రపంచ దేశాలు తీసుకెళ్ళి దక్షిణాసియా దేశాల్లో పెట్టబడులు పెడతాయని ... దీనివల్ల తమ దేశం నష్టపోతుందని చైనా భావిస్తోంది. అందుకే ఆయా దేశాల్లో యుద్ధ వాతావరణాన్ని సృష్టించి పెట్టుడలకు అనుకూల వాతావణం లేకుండా చేయాలన్న కుట్రతో  చైనా ముందుకు వెళ్తోంది. దీనిని పసిగట్టిన భారత్ తొడకొట్టి యుద్ధానికి సై అంటోంది. ఇప్పటికే చైనామీద ఉడికిపోతున్న  అమెరికా భారత్ కు, దక్షిణాసియా దేశాలకు బహిరంగంగా మద్దతు పలుకుతోంది. 
 
భారత్, ఇండియా గల్వాన్ ఘర్షణలపై స్పందిస్తూ.. గతవారం చైనాపై మైక్ పాంపియో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన స్పందించారు.  భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం ముదురుతున్న వేళ అమెరికా తరఫున కీలక ప్రకటన చేశారు. హాంకాంగ్‌ స్వేచ్ఛా స్వాతంత్రంపై చైనా గుత్తాధిపత్యం ఆ దేశ పౌరులకు పెను ప్రమాదమని హెచ్చరించారు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో. 
ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో చైనా విధానం ఏ మాత్రం సహేతుకమైనది కాదని విరుచుకుపడ్డారు. పక్క దేశ పౌరుల స్వేచ్ఛను హరించే హక్కు చైనాకు లేదని మండిపడ్డారు.  భారత్‌తో పాటు దక్షిణాసియాకు చైనా ముప్పు పొంచి ఉందని.. ఈ క్రమంలోనే చైనాను ఎదుర్కొనేందుకు అమెరికా దళాలను తరలిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు. అమెరికా నుంచి అత్యాధునిక సాయుధ దళం ఇండియాకు చేరుకున్నట్లు తెలుస్తోంది.