​అమెరికాకు హోప్ పెరిగినట్టుందిగా !!

August 09, 2020

అమెరికాను అగ్రరాజ్యంగా నిలపడం కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాల్లో జనాల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ప్రపంచంలో ఇంతవరకు ఏ కంట్రీలోను పెరగనంత వేగంగా అమెరికాలో మరణాల సంఖ్య పెరిగిపోయింది. ఇప్పటికే లక్ష మరణాలకు మానసికంగా సిద్ధమైన అమెరికా ఏర్పాట్లు చేసుకుంది. ప్రస్తుతానికి 15 వేల మరణాలతో ఇటలీ తర్వాత రెండో స్థానంలో ఉంది. స్పెయిన్ మూడో స్థానంలో ఉంది. రేపో మాపో ఇటలీని కూడా దాటేస్తుంది.

కరోనా దెబ్బకు అమెరికా వాణిజ్య నగరం న్యూయార్క్ విలవిలలాడిపోతోంది. ఇప్పటివరకు సంభించిన మరనాల్లో 11 మంది భారతీయులు కూడా ఉన్నారు. 

లాక్ డౌన్ విధిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ముప్పు ఏర్పడుతుందన్న కారణంగా దాని జోలికి పోలేదు అమెరికా. విచిత్రంగా అమెరికన్లు కూడా ఇదే ఆలోచనను సమర్థిస్తున్నారు. ఇక కేసుల విషయానికి వస్తే అమెరికాలో కేసుల సంఖ్య అత్యంత వేగంగా లక్షన్నరకు చేరుకుంది. 

అయితే... ముందు లక్ష రెండు లక్షణా లు మరణాలు ఉంటాయని ఊహించినా... మెల్లగా అమెరికా తన అంచనాలు తగ్గించుకుంటోంది. ఏర్పాట్లు చేసుకోవడం, కరోనాకు ఉపయోగిస్తున్న మందులు

మెరుగైన ఫలితాలు ఇవ్వడం, ఇమ్యూన్ పవర్ ను పెంచుకునే దిశగా ప్రజలు సిద్ధమవడం వంటి కారణలతో పాటు ప్రభుత్వం 94 శాతం మంది అమెరికన్లను ఇంటికే పరిమితం కామని ఆదేశించింది. 1.8 మీటర్ డిస్టెన్స్ కచ్చితంగా పాటించమని ఆదేశించింది. స్కూల్స్ వంటి వాటిని మూతవేసింది. కానీ ఎకానమీని దృష్టిలో పెట్టుకుని లాక్ డౌన్ ప్రకటించలేదు. తాజా అంచనాల ప్రకారం అమెరికాలో మరణాలు 60 వేలు దాటవు అని భావిస్తున్నారు.