ఆ మందు వాడితే కరోనా దెబ్బకు పోతోంది !

August 08, 2020

ఎట్టకేలకు కరోనాకు ఓ మంచి మందు దొరికింది. ఇపుడు అందుబాటులో ఉన్న అన్నిమందులకంటే వేగంగా కరోనాను పోగొడుతున్న మందు పేరు రెమెడిసివర్ (remedisivir). రెమెడిసివిర్ డ్రగ్ ద్వారా కరోనా రోగులు త్వరగా కోలుకొంటున్నారని అమెరికా అధికారికంగా ప్రకటించింది.  వాషింగ్టన్: రెమెడిసివిర్ డ్రగ్ ద్వారా కరోనా రోగులు త్వరగా కోలుకొంటున్నారని అమెరికా ప్రకటించింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ ఇన్పెక్షియస్ డీజీజెస్ డైరెక్టర్ ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ కరోనా వైరస్ పై ఈ మందు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తోందని అన్నారు. మిగతా ఏ మందులతో పోల్చిచూసినా... ఇది వేగవంతంగా తగ్గిస్తోందని చెప్పారు. అయితే, ఇప్పటికీ ఈ మందును ప్రయోగాత్మక ఔషధంగానే పేర్కొంటోంది. ఇది ఎంత ప్రభావం చూపుతోందంటే... కేవలం నాలుగు రోజుల్లో రోగులు కోలుకుంటున్నారట. 

కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టినా... అది అవసరమైనంత అందుబాటులోకి రావడానికి పట్టే సమయం ఏడాది ఉంటుందంటున్నారు. అందుకే వ్యాక్సిన్ తో పాటు మందుల అవసరం కూడా చాలా ఉందన్నారు. 68 వేర్వేరు ప్రాంతాల్లో ఈ మందును సుమారు వెయ్యి మందిపై పరీక్షించగా... మంచి ఫలితాలు సాధించామన్నారు. ఈ మందుతో రోగులు 4 నుంచి 11 రోజుల్లో కోలుకుంటున్నారని... అమెరికా కు చెందిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థతో ఫుట్ బాల్ ఆడుకుంటున్న కరోనాకు వ్యాక్సిన్ అవసరం కంటే మందు అవసరమే ఎక్కువ ఉంది. ఎందుకంటే.. వ్యాక్సిన్ అందరికీ ఇచ్చేలోపు ఇది సోకేవారికి ఉపయోగపడేది మందు మాత్రమే. అందుకే కరోనా వైరస్ కట్టడికి గిలియడ్ సైన్సెస్ కు  చెందిన రెమెడిసివిర్ సేవియర్ గా మారనుందన్నారు. 

రెమెడిసివర్ (remedisivir) గొప్పతనం ఏంటంటే.. మరణాలను కూడా బాగా తగ్గిస్తోంది. కరోనావైరస్ పై ఇంతకు మునుపు రెమెడిసివిర్  చైనాలో ఉపయోగించినా, ఫలితాలు పెద్దగా ఆశాజనకంగా లేవని చైనా పేర్కొంది. బహుశా చైనా చెప్పింది అబద్ధం కూడా అయి ఉండొచ్చు. ఈ మందు గాని, వ్యాక్సిన్ గాని తామే కనుక్కోవాలని చైనా గట్టి ప్రయత్నం చేస్తోంది.  గతంలో ఎబోలా కోసం రూపొందించిన ఈ మందుకు ఆమోదం లభించలేదు. మరి ఇపుడు ఏం జరుగుతుందో చూడాలి. 

English note: US drugmaker Gilead Sciences has declared that its experimental drug Remedesivir has shown positive results in clinical trial of Covid 19 patients.