కలకలం - ఏపీ ఎమ్మెల్యేకు కరోనా !

August 08, 2020

ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ అని తేలినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ఇటీవలే అమెరికా నుంచి వచ్చారని, ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్యే అని తెలుస్తోంది. ఆయనతో పాటు ఆయన గన్ మెన్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు చెబుతున్నారు.

ఈ వార్త దావానలంలా వ్యాపిస్తోంది. అయితే, ప్రభుత్వం ఇంకా అధికారికంగా దీనిని ఖరారు చేయలేదు. అయితే... ఈ వార్త తెలిసి ఏపీ ఎమ్మెల్యేలు అందరూ కంగారు పడుతున్నారు. ఎందుకంటే ఆయన మూడు రోజుల క్రితం అసెంబ్లీలో జరిగిన రాజ్యసభ ఎన్నికలకు హాజరై ఓటు వేశారు. 

ఆయనతో చాలామంది ఎమ్మెల్యేలు కలివిడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను కలిసిన వారంతా కంగారు పడుతున్నారని తెలుస్తోంది. ఈ దెబ్బతో ఎమ్మెల్యేలు అందరూ తమతోపాటు తమ కుటుంబ సభ్యులకు అందరికీ టెస్టులు చేయిస్తున్నారు. 

అంతేకాదు, అందరు గన్ మెన్లకు, డ్రైవర్లకు కూడా టెస్టులు చేస్తున్నారు. ఇపుడు ఇదో రాజకీయ నాయకుల్లో అంతర్గతంగా ఒక సంచలనం అవుతోంది.