కొత్త ట్రెండ్ సెట్ చేసిన పీకే.. ఈరోజు ఏం జరిగిందంటే

August 13, 2020

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా దూసుకుపోతోన్న పవన్ కల్యాణ్...ఫుల్ టైం పొలిటిషన్ గా మారిన తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ వచ్చింది. అయితే, మళ్లీ పవన్ సినిమాలు చేస్తున్నాడు అని తెలిసిన వెంటనే పవన్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు కూడా పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. హిందీలో ఘన విజయం సాధించిన `పింక్` రీమేక్ లో పవన్ నటిస్తున్నాడని తెలియడంతో పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. బిగ్ బీ నటించిన లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతుండడంతో ఇంకా ఎగ్జైట్ అయ్యారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టే ఫస్ట్ లుక్ విడుదల అయిన కొద్ది గంటల్లోనే ట్విట్టర్ వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లో నాలుగో స్థానంలో నిలిచింది. గ్యాప్ వచ్చి రెండేళ్లయినా....పవన్ పవర్ తగ్గలేదని ప్రూవ్ చేసింది.

అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే తొలి సారి ఒక సినిమా ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా కేక్ కటింగ్ ప్రోగ్రాం నిర్వహించడం విశేషం. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు కు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్ దగ్గర దిల్ రాజు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కేక్ కటింగ్ కార్యక్రమానికి పవన్ ఫ్యాన్స్ వందలాది మంది తరలి రావడం విశేషం. దీంతో సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఫస్ట్ లుక్ కు కేక్ కటింగ్ చేయించుకున్న ఘనత పవర్ స్టార్ దేనంటూ తెగ ఎగ్జయిట్ అవుతున్నారు. ఫస్ట్ లుక్ విడుదలకు సెలబ్రేషన్ చేయించాడని...ఏదైనా పీకే స్టామినా... రేంజే వేరని పొగిడేస్తున్నారు. తమ హీరో గబ్బర్ సింగ్ లో చెప్పినట్లు ...ట్రెండ్ ఫాలో కాడని...ట్రెండ్ క్రియేట్ చేస్తాడని అంటున్నారు. ఫస్ట్ లుక్ కే ఇంత హడావిడి చేసిన పవన్ ఫ్యాన్స్...ఇక, టీజర్... ట్రైలర్ విడుదల అయితే ఏ రేంజ్ లో సెలబ్రేట్ చేస్తారో అన్నది చూడాలి మరి.