వకీల్ సాబ్... అదరగొట్టాడు

August 03, 2020

హిందీలో అమితాబ్ నటించిన పింక్...సినిమాను తెలుగులో ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న పవన్ రీమేక్ చేస్తున్నారు. రెండేళ్ల విరామం తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న పవన్ లాయర్ గా ఈ సినిమాలో కనిపించనున్నారు. టైటిల్ వకీల్ సాబ్ గా మార్చిన విషయం తెలిసిందే. ఈసినిమా ఫస్ట్ లుక్ కొద్ది నిమిషాల క్రితం విడుదలైంది. 

నిమిషాల్లో ఫస్ట్ లుక్ విపరీతంగా వైరల్ అయిపోయింది. ట్రెండ్ సెట్ చేస్తోంది. ఆటోలో తన ఆఫీస్ ఫర్నీచర్ వేసుకుని అందులోనే కూర్చుని పుస్తకం చదువుతూ ఉన్న స్టిల్ విడుదల చేశారు. ఈ పోస్టరుతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.