ఇలా జరగడం... టాలీవుడ్లో మొదటిసారా?

August 06, 2020

పింక్ రీమేక్‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీఎంట్రీనా అంటూ అభిమానుల‌తో పాటు అంద‌రూ నిట్టూర్చిన వాళ్లే. కానీ సినిమా ఏదైతేనేం.. అక్క‌డున్న‌ది ప‌వ‌న్ అయితే అంటూ అంద‌రూ అభిప్రాయాలు మార్చేసుకుంటున్నారు. ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీతో రీఎంట్రీ ఇస్తూ కూడా ప‌వ‌న్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న తీరుకు దేశ‌మంతా షాకైపోతోంది.

సోమ‌వారం ఈ సినిమా టైటిల్, ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేసిన సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో ఎలా షేకైపోయిందో తెలిసిందే. బాలీవుడ్ మూవీ సూర్య‌వంశీ ట్రైల‌ర్‌కు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్‌ను కూడా వెన‌క్కి నెట్టేసి ఇండియా లెవెల్లో టాప్^3 ప్లేసుల్ని వ‌కీల్ సాబ్ హ్యాష్ ట్యాగ్సే ఆక్ర‌మించేశాయి. సోష‌ల్ మీడియాలో మ‌రిన్ని రికార్డుల్ని వ‌కీల్ సాబ్ సొంతం చేసుకున్నాడు.
ఇండియాలో ఓ సినిమా ఫ‌స్ట్ లుక్‌కు ఒక్క రోజులో అత్య‌ధిక ట్వీట్లు ప‌డ్డ సినిమా వ‌కీల్ సాబ్‌యే కావ‌డం విశేషం.

24 గంట‌ల వ్య‌వ‌ధిలో వ‌కీల్ సాబ్ మీద నెటిజ‌న్లు ఏకంగా 35 ల‌క్ష‌ల ట్వీట్లు వేయ‌డం విశేషం. ఇది ఇండియ‌న్ సినిమాలోనే రికార్డు. అలాగే తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఒక సినిమా ఫ‌స్ట్ లుక్‌కు ఒక్క రోజులో అత్య‌ధిక రీట్వీట్లు ద‌క్కించుకున్న సినిమాగా కూడా వ‌కీల్ సాబ్ రికార్డు సృష్టించింది. 24 గంట‌ల్లో 24 వేల రీట్వీట్లు అయింది ఫ‌స్ట్ లుక్‌. దీన్ని బ‌ట్టి ప‌వ‌న్ క్రేజ్ ఎలాంటిద‌న్న‌ది అర్థం చేసుకోవ‌చ్చు. మొత్తానికి వ‌కీల్ సాబ్ ఫ‌స్ట్ లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావ‌డంతో.. ఇక ఫ‌స్ట్ టీజ‌ర్ మీదికి అంద‌రి దృష్టి మ‌ళ్లింది. బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.