వైకాపా అలజడి- వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం...

April 04, 2020

వల్లభనేని వంశీ జగన్ తో కలిశాడు. ఎన్నికలపుడు కేసీఆర్ - జగన్ సయోధ్య గురించి భారీ లీకులు ఇచ్చిన ఆ వంశీయే ఈ వంశీ. ఈరోజు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, బందరు ఎమ్మెల్యే పేర్ని నానితో కలిసి ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. తెలుగుదేశం పార్టీలో స్ట్రాంగ్ వాయిస్ ఉన్న లీడర్లలో ఒకరైన వంశీ జగన్ ని కలవడం తెలుగుదేశం శ్రేణులను కలవరానికి గురిచేసిన మాట నిజమే. వాస్తవానికి ఆయన ఒక రోజు మందు తన అనుచరులతో సమావేశం అయినపుడే కొన్ని అనుమానాలు కలిగాయి. కాకపోతే 24 గంటల్లోనే ఇలా జగన్ ను కలుస్తాడని ఎవరూ ఊహించలేదు.

ఇదిలా ఉంటే...వల్లభనేని వంశీపై పార్టీ మార్పు గురించి చాలా ఒత్తిడి ఉందని తెలుస్తోంది. దానికి తగినంత ప్రతిఫలం చేకూర్చడానికి కూడా వైకాపా అధ్యక్షుడు సిద్ధంగా ఉన్నారు. జగన లక్ష్యం వంశీని లేదా వంశీ వంటి వారిని కొనడం కాదు.. తెలుగుదేశం బలమైన వేళ్లను తుంచడం. ఆ లక్ష్యంలో భాగంగా జగన్ పనిచేస్తున్నారు. అలాంటి బలమైన వేళ్లలో ఒకటి వంశీ. మరోవైపు ఏ ఇతర నాయకుడో టీడీపీని వీడాటంటే... ఓకే గాని వల్లభనేని వంశీ వంటి వ్యక్తులు పార్టీని వీడటం అనేక ఇతర సంకేతాలకు కారణం అవుతుంది.

అయితే... ఈ పరిణామంలో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఇప్పుడు ప్రకటించకపోయినా... వల్లభనేని వంశీ పండగ అనంతరం వైకాపాలో చేరున్నారు అనేద స్పస్టమైంది. అందుకు గాను ఒక సంలచన నిర్ణయానికి సిద్ధపడినట్లు అర్థమవుతుంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీ వీడాలని జగన్ పెట్టిన షరుతుకు వల్లభనేని ఓకే అన్నారుట.. ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అంటే అసెంబ్లీలో ఫిరాయింపులు చేయకుండానే టీడీపీ సీట్లు తగ్గించే ప్లాన్ లో ఉన్నారు వైఎస్ జగన్. 

మరోవైపు ఒక కేసు తనపై నమోదైన వెంటనే ఇలా జగన్ కు వల్లభనేని సరెండ్ కావడంపై ఆయన అభిమానులు సీరియస్ గానే ఉన్నారు. ఎదురొడ్డి పోరాడకుండా ఇలా జంపింగ్ నేచర్ తో పెద్ద లాభం ఉండదని చాలామంది చెబుతున్నారు.