వాల్మీకి... పోస్టర్ అదిరిందిగా

February 16, 2020

మెగా ఫ్యామిలీలో నాగబాబు కుటుంబం కాస్త డిఫరెంట్. మిగతా అందరు మెగా ముద్ర నీడలో ఎదిగినా... వరుణ్ తేజ్ మాత్రం ఆ ఇమేజ్ తో సంబంధం లేని సినిమాలు చేసుకుంటూ తన కెరీర్ తీర్చిదిద్దుకుంటున్నారు. గుర్తుండే పాత్రలు ఎంచుకుంటున్నారు. అతనిదో శైలి. కంచె, ఫిదా... వంటివి డిఫరెంట్ వేలో చేశారు. తాజాగా వాల్మీకి అనే సరికొత్త పాత్రలో వైరల్ అయ్యారు వరుణ్. పూర్తి గడ్డం పెంచుకుని... రాటుదేలిన రాక్షసుడిలా వరుణ్ వాల్మీకి టీజర్ లో చూసి చూపు భలే ఆదరణ పొందింది. 

తాజాగా వాల్మీకి సినిమా టీజర్ కు భిన్నమైన పోస్టర్ ఒకటి విడుదల అయ్యింది. 1980ల నాటి డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ తో ఆకట్టుకుంటున్నారు వరుణ్. గని అలియాస్ గద్దలకొండ గణేష్ అంటూ ఈ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు వరుణ్ తేజ్.