అమ‌రావ‌తి కోసం అదిరిపోయే ప్ర‌శ్న వేసిన వంగ‌వీటి రాధా

July 04, 2020
గ‌త కొంత‌కాలంగా ఇటు మీడియాకు, అటు రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్న టీడీపీ నేత, ప్ర‌ముఖ కాపు నాయ‌కుడు వంగవీటి రాధా తాజాగా రాజధానిగా అమరావతి కొనసాగించాలంటూ తుళ్లూరులో నిరసనలు హోరెత్తిస్తున్న రాజధాని రైతులకు అండ‌గా నిలిచారు. దీక్షా శిభిరాన్ని సంద‌ర్శించిన రాధా అన్న‌దాత‌ల‌కు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను ఇర‌కాటంలో ప‌డేశారు. ఏ జిల్లాలో అయితే వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణం చేశారో ఆ జిల్లాకే వెన్నుపోటు పొడిచారని రాధా విమర్శలు గుప్పించారు. వైసీపీని 30 రాజధానులైనా అనుకోనివ్వండి కానీ.. మాకు తెలిసి ఒకటే రాజధాని, ఒకటే రాష్ట్రమని జ‌గ‌న్ స‌ర్కారు తీరును ఎండ‌గ‌ట్టారు.
`పక్క రాష్ట్రం సీఎంతో మాట్లాడటానికి ముఖ్యమంత్రి జగన్‌కు సమయం ఉంది. రాజధాని రైతులతో మాట్లాడేందుకు సమయం లేదా? ` అని సీఎం జ‌గ‌న్‌ను వంగ‌వీటి రాధా సూటిగా ప్ర‌శ్నించారు.  ‘‘రైతులకు కులాలు అంటగట్టడం సరికాదు. రాజధాని రైతుల త్యాగం దేశానికే ఆదర్శం. రైతులకు మద్దతుగా ఉంటాం. రైతుల నాయకత్వంలో మేమంతా నడుస్తాం. మూడు రాజధానులు అన్నా.. 30రాజధానులు అన్నా.. మనకు తెలిసిన ఒకే నినాదం ఒక్కటే. ఒకటే రాష్ట్రం.. ఒకటే రాజధాని.. అదే అమరావతి అనే నినాదంతో కలిసికట్టుగా ముందుకెళ్దాం’’ అని పిలుపునిచ్చారు.

 

Read Also

జ‌గ‌న్‌ను సుజ‌నా భ‌లే ఇరికించాడుగా
ఒక‌నాటి వైఎస్ న‌మ్మిన‌బంటు... కేసీఆర్‌-జ‌గ‌న్ కు ప్రశ్నలు
సొంత గుర్తింపు కోసం అల్లు వారి తాప‌త్ర‌యం ?