వాణి శ్రీ కొడుకు మృతి.... అనేక అనుమానాలు

May 29, 2020

ఊటీలో వైద్యుడిగా ప్రాక్టీస్ చేస్తున్న ఒకప్పటి నటి వాణిశ్రీ కుమారుడు మరణించారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు అభినయ్ వెంకటేష్ గుండెపోటుతో నిద్రలోనే చనిపోయినట్టు చెబుతున్నారు. అభియన్ కు పెళ్లయ్యింది. భార్య కూడా డాక్టరు. చిన్న వయసులో కుమారుడు చనిపోవడం వాణిశ్రీనీ తీవ్ర వేదనకు గురిచేసింది. ఈ సంఘటన పట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 

అయితే, ఇది అనుమానాస్పద మృతి అని, ఆత్మహత్య అని కూడా వార్తలు వస్తున్నాయి. అభినయ్ వయసు 36 సంవత్సరాలే. ఈ వయసులో గుండెపోటు రావడం, వెంటనే మొదటిసారి గుండెపోటు వచ్చినపప్పుడే మరణించడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్ లో ఉండి ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also

ఆ అమ్మాయి ప్రేమ ప్రపంచాన్ని గెలిచింది
పోలీసులు-కార్యకర్తల మధ్య నలిగిపోతున్న వైసీపీ ఎంపీ
Pics: సొగసులతో చంపేస్తావు తెలుసా నువ్వు...