ఏంటో ఆమె మూడో పెళ్లికీ ముప్పొచ్చింది?

August 05, 2020

వనిత విజయకుమార్. 27వ తేదీన జస్ట్ రెండ్రోజుల క్రితం ఘనంగా మూడో పెళ్లి చేసుకుంది. అది కూడా పెటాకులయ్యే పరిస్థితి వచ్చిందా? ఈ పెళ్లి మూణ్ణాళ్ల ముచ్చటేనా? అని అనుమానాలు వస్తున్నాయి. వరుడు, వధువుల మధ్య సమస్యలేం రాలేదు గాని.. అనుకోని ట్విస్ట్ వచ్చింది. 

వనిత విజయ్ కుమార్ ఇప్పటికి రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్నారు. ఆ రెండు పెళ్లి ద్వారా కలిగిన పిల్లలు ఇపుడు బాగా పెద్దవాళ్లయ్యారు. పెద్దమ్మాయి పదో తరగతి చదువుతోంది. ఆ అమ్మాయి సమక్షంలోనే మూడో పెళ్లి మొన్న జరిగింది. ఈ ఫొటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి.

ఆమె మూడో వివాహం ఫిలింమేకర్ పీటర్ పాల్ తో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరిగింది.  వాస్తవానికి ఈ పెళ్లికి పది రోజుల ముందే వనిత స్వయంగా వెడ్డింగ్ కార్డ్ బయటపెట్టింది. బహిరంగంగా ప్రకటించింది. 

పెళ్లయ్యేదాకా సైలెంట్ గా ఉన్న పీటర్ పాల్ మొదటి భార్య ఎలిజబెత్ ఇపుడు సడెన్ గా తెరమీదకు వచ్చి ఈ వివాహం చెల్లదు అంటోంది. ఆమె చెన్నై, వడపళని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

పీటర్ పాల్ మొదటి భార్య వాదన ఏంటంటే.. తన నుంచి విడాకులు తీసుకోకుండానే మరో పెళ్లి చేసుకున్నాడని చెబుతోంది. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించిన పీటర్ పాల్ పై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో కోరింది. తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తాము గత ఏడేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నామని వెల్లడించింది. ఆమె వ్యవహరించింది.

కొసమెరుపు - ఏడేళ్ల నుంచి మొగుడ్ని వదిలేసి ఇపుడు ఎవరినో పెళ్లి చేసుకున్నాడు అంటావేంటి నువ్వు వదిలేయకపోతే చేసుకునే వాడా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అభ్యంతరాలు ముందే చెప్పి ఉండొచ్చు కదా అంటున్నారు. 10 రోజుల ముందే ప్రకటించినా ఎందుకు పెళ్లయ్యాక బయట పెట్టావంటోంది లోకం.