మూడో మొగుడి కోసం...గట్టి పోరాటం, ఇంతలో ట్విస్ట్

August 10, 2020

చట్టబద్ధంగా నడుచుకున్నంతవరకు ఒకరికి విడాకులు ఇచ్చి... ఇంకొకరిని... అలా ఎంత మందిని అయినా పెళ్లి చేసుకోవచ్చు. కాకపోేతే చట్టం మీరితే బూమ్ రాంగ్ అవుతుంది. అయితే... ఒకమ్మాయికి రెండో పెళ్లి అంటే అదోలా చూస్తుంది మన సమాజం. ఇక మూడో పెళ్లిని ఉత్సాహంగా చేసుకుంటే ఇక చెప్పేదేముంది, కోడై కూస్తుంది. కానీ అది తప్పు కాదు అని చెప్పినా ఎవరూ పట్టించుకోరు. పెద్ద చర్చ పెడతారు. ఇలాగే రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకుని, తర్వాత ఒకరితో పెళ్లిదాకా వెళ్లి ఆగిపోయి ... ఇపుడు మూడో పెళ్లి చేసుకున్న వనిత విజయ కుమార్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలుసు. 

పాపం ... హుషారుగా, మూడో భర్తని ప్రేమించి వలచిన ఆమెకు కొత్త తిప్పలు వచ్చాయి. పెళ్లికి దాదాపు రెండు వారాల ముందే బహిరంగ ప్రకటన చేసినా... మూడో భర్త పీటర్ పాల్ యెక్క మొదటి భార్య... వనతి, పీటర్ ల పెళ్లయ్యాక వీరిపై డవకు వచ్చింది. ఆమె వాదన ఏంటంటే... నాకు విడాకులు ఇవ్వకుండానే వనిత తన మొగుడ్ని ఎగరేసుకుపోయిందట. వీరు ముగ్గురు గొడవ పడ్డారంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ వీరి మధ్యలోకి మరో నలుగురు దూరారు. వారికి ఈ పెళ్లికి సంబంధమే లేదు.

వనితపై విమర్శలు చేసి ఆమెపై విమర్శలు చేసిన వారు... సూర్యాదేవీ, లక్ష్మీ రామకృష్ణన్, కస్తూరీ శంకర్, నిర్మాత రవీంద్రన్.  ఈ గొడవ తమిళనాడులో విపరీతంగా పెరుగుతున్న కోవిడ్ కంటే ఎక్కువ వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియా నిండా ఈమె గొడవే. వీరితో పోరాడినంతవరకు పోరాడి విసుగెత్తి పోలీసు కేసు కూడా పెట్టింది. దీంతో ఆమెపై తూటాలు పేల్చిన కొందరు స్టేషను మెట్లెక్కాల్సి వచ్చింది.

దీంతో ఆమె వ్యతిరేకులు కొందరు ఒక ఫొటోను వైరల్ చేశారు. అందులో వైన్ గ్లాసుతో వనిత ఇంకొక మగాడి ఒడిలో వాలి ఉంది. దీనికి వనిత రిప్లై మరింత షాక్ ఇచ్చింది. ఆ ఫొటో నిజమే, మార్ఫింగ్ కాదు అని చెప్పిన వనిత... అయితే... నాతో పాటు వైన్ తాగుతున్న వ్యక్తి భార్య కూడా ఆ పక్కనే ఉందని.. ఫొటోలో ఆమెను కట్ చేసి నన్ను బ్యాడ్ చేయడానికి ఆ ఫొటోను వాడుతున్నారని వనిత క్లారిటీ ఇచ్చింది.