ఈ తెలుగు నటికి  ముగ్గురు భర్తలు, ఒక బాయ్ ఫ్రెండ్ !

August 05, 2020

నటుడు విజయ్ కుమార్ కూతురు వనిత గుర్తుందా? అదేనండీ తమిళ తెలుగు నటి, బిగ్ బాస్ 3 సెన్సేషన్. వనిత విజయకుమార్ ఇపుడు మూడో పెళ్లికి రెడీ అయ్యింది. ఇప్పటికే ఆమెకు రెండు పెళ్ళిళు, ఒక సహజీనం అయ్యాయి. జూన్ 27న మళ్లీ పెళ్లి.

కొందరు జీవితాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. కొందరు తమను తాము సీరియస్ గా తీసుకుంటారు. ఇంకొందరు మార్పులను సీరియస్ గా తీసుకుంటారు. వనిత విజయ్ కుమార్... తనకు నచ్చిందే చేస్తుంది. అది ఇంకొకరికి నచ్చాల్సిన అవసరం లేదు.

 

తెలుగులో కోడి రామ‌కృష్ణ తెర‌కెక్కించిన దేవి సినిమాలోను ఈమె నటించారు. ఈమె తరచు వార్తల్లో ఉంటారు. వనిత 2000లో నటుడు ఆకాష్‌ను పెళ్లాడారు. వీరిద్దరికి ఒక కొడుకు, కూతురు పుట్టారు. 2007లో ఆకాశ్ తో విడాకులు తీసుకున్నారు. 

2007లో ఆనంద్‌ జయదర్షన్‌ అనే వ్యాపారవేత్త పెళ్లాడారు. అది కూడా నిలవలేదు. 2012లో విడాకులు. వీరికి ఒక కూతురు.

డ్యాన్స్ మాస్టర్ రాబర్ట్‌తో స‌హ‌జీవ‌నం సాగించినట్లు చాలా వార్తలు వచ్చాయి. 

ఇపుడు పీటర్‌ పాల్‌ తో ఆమె మూడోసారి తన జీవితంలో పెళ్లి తంతు జరుపుకోనుంది.  జూన్ 27న పెళ్లి.  అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఇంకా రాలేదు. 

Image 

above : Peter paul photo