అసలు నేను పెళ్లే చేసుకోను - సౌత్ హీరోయిన్

February 25, 2020

ప్రముఖ తెలుగు నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుసు కదా. ఆమె సంచలన నిర్ణయం ప్రకటించింది. ఇంతవరకు విశాల్ తో లవ్ లో ఉందని ఆమె గురించి ప్రచారం చేసుకుంది. అయితే... విశాల్ హైదరాబాదు అమ్మాయి అనీషాతో ఎంగేజ్ మెంట్ చేసేసుకున్నాడు. మరి దీనికి హర్టయిందో.. లేదా గోళీ మార్ మూవీలో రోజాలాగా... అసలే పెళ్లే వేస్టనుకుందో ఏమో తాను జీవితంలో పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పింది వరలక్ష్మీ.

శ్రావణ మాసంలో ఈ వరలక్ష్మి తనకు తాను శాపం ఎందుకు పెట్టుకుందో మరి ఘాటైన నిర్ణయం వెల్లడించింది. భవిష్యత్తులో తాను ఎవరినీ పెళ్లి చేసుకోబోనని చెన్నైలో జరిగిన తన సినిమా కన్య రాశి ప్రెస్ మీట్ లో వరలక్ష్మి ప్రకటించింది. చిత్రం ఏంటంటే... ప్రేమ వివాహం నేపథ్యంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 

RELATED ARTICLES

  • No related artciles found