మా నాన్నకు భార్య నాకు ఆంటీ అవుతుంది- హీరోయిన్

June 02, 2020

కంగారుపడకండి. ఇవి శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు. బోల్డ్ గా కనిపించడంలో గాని, వినిపించడంలో గాని తమిళ ఇండస్ట్రీలో ఆమెకు ఆమే సాటి. శరత్ కుమార్ మొదటి భార్య చాయ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్. అయితే, 2000 ఏడాదిలో శరత్ కుమార్ తో విడాకులు తీసుకున్నారు. తర్వాత శరత్ కుమార్ అలనాటి హీరోయిన్ రాధికను వివాహమాడారు. రెండు దశాబ్దాలు గడిచింది ఇప్పటికి.  తాాజాగా వరలక్ష్మీ రాధిక కు తనకు ఉన్న సంబంధాల గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాధిక మానాన్నకు భార్య అవుతుంది. కానీ నాకు అమ్మ కాలేదు. ఎవరికైనా ఒకరే అమ్మ. రాధికను నేను ఇంట్లో ఆంటీ అనే పిలుస్తాను. మా ఇద్దరి మధ్య సంబంధాలు మంచిగానే ఉన్నాయి. ఆమెకు ఇవ్వాల్సిన గౌరవంలో ఏ మాత్రం లోటు రానివ్వలేదు. అయినా... అమ్మగా మాత్రం ఆమెకు నేను స్థానం ఇవ్వలేను అని చెప్పింది వరలక్ష్మి. 

నేను నాకు నచ్చింది మాట్లాడతాను. అందుకే కొందరు నాకు దూరంగా ఉంటారు అని తన గురించే తానే చెప్పేసుకుంది. ఆమెకు హీరోయిన్ గా మంచి అవకాశాలు రావడం లేదు గాని... తనకు తగిన పాత్రలు మాత్రం బాగా వస్తున్నాయి. విలనిజం ఉన్న క్యారెక్టర్లలో వరలక్ష్మి మంచి పేరు సంపాదిస్తోంది. తాజాగా వెల్వెట్ నగరం అనే సినిమాలో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది.