ఆ పదవిని మళ్లీ కమ్మోళ్లకే ఇచ్చిన జగన్

July 08, 2020

ఏపీ మహిళా చైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మ నియమితులయ్యారు. నిన్నటి వరకు తెలుగుదేశం నేత నన్నపనేని రాజకుమారి ఆ పదవిలో కొనసాగారు. పాత కొత్త చైర్ పర్సన్ లు ఇద్దరూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. ఏపీలో జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి వరుసగా పదవుల పందేరం చేస్తున్నారు. పదవీ కాలంతో సంబంధం లేకుండా తెలుగుదేశం వాళ్లందరికీ సైలెంట్ సందేశాలు పంపిస్తూ వారంతట వారు పదవులు వదిలిపోయేలా చేస్తున్నారు. నిన్న పదవికి రాజీనామా చేస్తూ... నన్నపనేని ఒక వ్యాఖ్య చేశారు. నాకింకా పదవీ కాలం ఉంది. కానీ ప్రభుత్వం మారింది కాబట్టి నైతిక బాధ్యతతో రాజీనామా చేస్తున్నాను అన్నారు. 

ఇదిలా ఉండగా... ఈమె నియామకంతో ఫైర్ బ్రాండ్లకు జగన్ మంచి పదవులు కట్టబెడుతున్నట్లయ్యింది. నగరి ఎమ్మెల్యే రోజాకు ఏపీఐఐసీ ఛైర్మన్‌ పదవి దక్కింది. ఆ తర్వాత పద్మకు ఇపుడు ఈ పదవి దక్కింది. వీరిద్దరూ వైసీపీ తరఫున బయట ఒకరు, అసెంబ్లీ లోపల ఒకరు తెలుగుదేశం ప్రభుత్వంపై విరుచుకుపడేవారు. 

ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా వాసిరెడ్డి పద్మను నియమించినట్లు ప్రకటించినా ఉత్తర్వులు ఇంకా రాలేదు. ఈమె గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో వైసీపీ ఓడినా ఆమె పార్టీ మారలేదు. అందుకే జగన్ ఆమెను గుర్తించినట్లు తెలుస్తోంది. 

Read Also

140 కోట్లు పెట్టి మన హీరోయిన్ ఇల్లు కొనేసింది !!
విజయవాడలో దేశద్రోహులు !
పదవి ఇచ్చినా... పృథ్వీలో అసంతృప్తి ఎందుకు....?