సర్ ప్రైజ్ చేసిన వీరప్పన్ కూతురు

August 08, 2020

ఇండియాస్ పాపులర్ స్మగ్లర్, కరడుగట్టిన నేరస్థుడు అయిన వీరప్పన్ కుమార్తె ఆశ్చర్యకరంగా వార్తల్లోకి ఎక్కింది. దేశంలోనే అత్యంత ఖరీదైన నేరస్థుడిగా రికార్డులకెక్కి వీరప్పన్ క్రైమ్ చరిత్రలో సంచలనం అయితే... ఆయన కూతురు తాజాగా రాజకీయ సంచలనం సృష్టించింది. వీరప్పన్ కూతురు విద్యారాణి ఈరోజు బీజేపీలో చేరింది. కర్ణాటక సరిద్ధులో ఉన్న తమిళనాడులోని కృష్ణగిరి నియోజకవర్గంలో నివసించే విద్యా రాణి ఈరోజు బీజేపీ జాతీయ నేత మురళీధరరావు నేతృత్వంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి బీజేపీ నేత పొన్ రాధాకృష్ణన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విద్య తో పాటు మరో వెయ్యిమంది బీజేపీలో చేరారు. 

విద్యారాణి... వీరప్పన్ ఇద్దరు కూతుర్లలో పెద్ద కుమార్తె. ఈమె ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరప్పన్ చనిపోవడంతో ఆమెకు తల్లి మాత్రమే ఉంది. అయితే... విద్య ప్రేమ వివాహనాకిి తల్లి ఒప్పుకోకపోడంతో విద్య కోర్టును ఆశ్రయించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉండగా... తాజా కార్యక్రమంలో ఆమె తండ్రి వీరప్పన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘వీరప్పన్ ప్రజలకు మంచి చేయాలని అనుకున్నాడని, కానీ ఆయన ఎంచుకున్న మార్గం తప్పుడు మార్గం’ అని ఆమె వ్యాఖ్యానించారు.  తాను మాత్రం  ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాల ద్వారా ప్రజాసేవ చేయాలని వచ్చాను అన్నారు. మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో దేశాన్న సుసంపన్న చేసే దిశగా తాను అంకిత భావంతో కృషి చేస్తానని అన్నారామె. 

వీరప్పన్ ఎవరో ఈజనరేషన్ లో కొందరికి తెలియకపోవచ్చు. భారతదేశ చరిత్రలో భారత పోలీసు వ్యవస్థ అతడిని పట్టుకోవడానికి చేయని ప్రయత్నమే లేదు. 1991 నుంచి 2004 వలకు 14 సంవత్సరాలు పాటు కష్టపడి, వంద కోట్లు ఖర్చు పెట్టి ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఇంత ఖరీదైన్ ఆపరేషన్ భారతదేశ చరిత్రలో మరోటి లేదు. ఈ క్రమంలో ఎంతో మంది పోలీసులు చనిపోయారు. వీరప్పన్ గంధపు చెక్కల దొంగ మాత్రమే కాదు, కిడ్నాపర్ కూడా. పలువురు కన్నడ సినీ ప్రముఖులను ఆయన కిడ్నాప్ చేశారు.